
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ‘సన్నాఫ్ ఇండియా’ తో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇమేజ్ దారుణంగా పడిపోయింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ లెగసీ ఉన్న హీరోకు మొదటి రోజు ఈ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అంతేకాదు.. కొన్ని చోట్ల ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా చూసేందుకు ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ అయిన సందర్భాలున్నాయి. విడుదలకు ముందు ఈ సినిమాపై ట్రోలింగ్స్ నేపనల్ వైడ్ ట్రెండ్ అయ్యాయి. దీంతో ఈ సినిమాకు కాస్తో కూస్తే చెపుకోదగ్గ కలెక్షన్స్ వస్తాయనుకున్నారు. కానీ అవేవి ఈ సినిమాకు కాసుల వర్షం తెప్పించలేకపోయాయి. చాలా చోట్ల థియేటర్స్ నిర్వాహకులకు కనీసం కరెంట్, రెంట్, క్యాంటీన్, పార్కింగ్ వంటి మెయింటెన్స్ కూడా రాలేదు. మొత్తంగా గత కొన్నేళ్లుగా ఏ సినిమాకు లేనట్టుగా ఈ సినిమా కనీపం చిన్న సినిమాలు వచ్చే కలెక్షన్స్ సైతం రాకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
మొత్తంగా ఈ సినిమా ఓవరాల్గా మొదటి రోజు రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షల మేరకు కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మొత్తంగా 350 పైగా థియేటర్స్లో విడుదల చేశారు. మొత్తంగా డెఫిసిట్స్లు, నెగిటిల్ షేర్స్ తీసేస్తే.. మొత్తంగా జీరో అని చెప్పాలి. గతమెంతో ఘనమో అని చెప్పుకోవడానికే తప్ప ప్రస్తుతం మోహన్ బాబు తన కంటూ ఫ్యాన్ బేస్ అంటూ లేకుండా పోయిందనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమాను డిజాస్టర్స్లోనే ఆల్ టైమ్ ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి ..
- సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!
- వైసీపీలో జిల్లాల సెగ.. ఆనం, రోజా రచ్చరచ్చ!
- టీకాంగ్రెస్ కు బిగ్ షాక్.. కారెక్కనున్న ఎమ్మెల్యే!
- బండిపైనే కేసీఆర్ పోటీ? గులాబీ స్కెచ్ ఇదేనా..
One Comment