
- ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి నిప్పంటించిన కామాంధుడు
క్రైమ్ మిర్రర్, నారాయణపేట జిల్లా ప్రతినిధి: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు స్వరూపను (పేరు మార్చడం జరిగింది) కోయిలకొండ మండలం వింజమూరు గ్రామానికి చెందిన వెంకట్ రాములు అనే యువకుడు మద్దూర్ మండలానికి తీసుకువచ్చి ప్రభుత్వాస్పత్రి వెనకాల లైంగికంగా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అందుకు సదురు మహిళ ఒప్పుకోలేదని ఆమె ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించి, అక్కడి నుంచి పారిపోయాడు. అటుగా వెళ్తున్న జనాలు బాధితురాలిని చూసి చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందింది. మద్దూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షురాలు రాధమ్మ మాట్లాడుతూ వెంకట్ రాములుని పోలీసులు పట్టుకుని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి…
- సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!
- ఉచిత అంబులెన్స్ సర్వీస్ వాహనాలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు
- మోహన్ బాబుకు ఘోర అవమానం!
2 Comments