
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. పూర్తిగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు జనంలో ఉంటున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలతో హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఏ క్షణానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని అంటున్నారు. కేసీఆర్ దూకుడుతో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో… ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయక పోవచ్చని పార్టీ వర్గాలలో బలంగా వినవస్తోంది.
ఇటీవల జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో, జిల్లా అధ్యక్షుల ఎంపికలో కేటీఆర్ టీముకే పెద్ద పీట వేశారు గులాబీ బాస్. ఈ నేపధ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర పగ్గాలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగింఛి ఆయన ఢిల్లీకి చేరతారని అంటున్నారు. మంత్రి హరీష్ రావును మెదక్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దించుతారని చెబుతున్నారు. ఇటీవల విలేకరుల సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరం అయితే వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేస్తానని, అది తనకేమీ కొత్త కాదని చెప్పు కొచ్చారు. దీంతో కేసీఆర్ లోక్ సభకు పోటీ చేస్తే ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారనే విషయంలో రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Read More : రేవంత్ ను అరెస్ట్ చేసి సిటీ మొత్తం తిప్పిన పోలీసులు..
కేసీఆర్ లోక్ సభకు పోటీ చేయడం అంటూ జరిగితే కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఉద్యమ సమయంలో ఆయన ఇదే నియోజక వర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలిచారు. కరీంనగర్ ఎంపీగానే ఆయన మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. కరీంనగర్ నుంచి రెండుసార్లు గెలిచినా అందులో ఒకసారి మాత్రమే భారీ మెజారిటీతో గెలిచారు, రెండవ సారి స్వల్ప అధిక్యతతో బయట పడ్డారు. కరీంనగర్ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వినోద్ కుమార్.. బీజేపీ అభ్యర్ది బండి సంజయ్ చేతిలో ఒడి పోయారు. కేసీఆర్ నిజంగా కరీంనగర్ బరిలో దిగితే పోటీ బాగా రక్తి కడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే కరీంనగర్ ఎంపీ ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షిస్తుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్ల పట్టివేత
- బీజేపీకి ఓటేయనివారి ఇంటిపైకి బుల్డోజర్!
- తల్లి, తాతల మధ్య అక్రమ సంబంధం.. ముక్కుపచ్చలారని చిన్నారి బలి!
- కేసీఆర్ దూకుడు అందుకేనా? ఇంత పెద్ద స్కెచ్ ఉందా?
- ‘లింక్’ కట్…! నక్షబాట ను మింగిన అనకొండ లు