
- నక్ష బాట పునరుద్ధరణ
క్రైమ్ మిర్రర్, షాద్ నగర్ ప్రతినిధి: రియల్టర్ల కబంద హస్తాల్లో ఉన్న నక్షబాటకు అధికారులు మోక్షం కల్పించారు. బుధవారం క్రైమ్ మిర్రర్ దినపత్రికలో ప్రచురితమైన ‘లింక్ కట్’ కథనానికి మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ మురళీకృష్ణ సర్వేయర్ బీమ్లా నాయక్, రెవెన్యూ చెన్నకేశవులుతో సర్వే చేయించారు. స్థానిక తహసీల్దార్ ఆదేశాల మేరకు అడ్డంగా ఉన్న ఫీనిషింగ్ వైర్ లను తొలగించి సిబ్బంది నక్షబాటకు విముక్తి కల్పించారు. ప్రభుత్వ భూములను ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. నక్షబాట విముక్తి కలగడం వల్ల పుట్టోని గూడ, సంగెం, దత్తాయపల్లి, ఫరూక్ నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామాలకు చెందిన సమీప రైతులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి…