
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు హాట్ హాట్ రాజకీయాలకు వేదికైంది. కేసీఆర్ పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తన్నారు టీఆర్ఎస్ శ్రేణులు. ఆయనకు జాతీయ స్థాయి నేతల నుంచి విషెష్ వస్తున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ మాత్రం నిరసనలకు పిలుపిచ్చింది. కేసీఆర్ బర్త్‌డే రూపంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంచి ఛాన్స్ దొరికింది. తెలంగాణ వ్యాప్యంగా ఆయన నిరసనలకు పిలుపు ఇచ్చారు పీసీసీ చీఫ్. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ తాను సైతం ధర్నాకు దిగాలని భావించారు. అంతేకాదు ఉసరవెల్లికి హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.
రేవంత్‌రెడ్డి అంత దూకుడుగా వ్యవహరిస్తే పోలీసులు ఊరుకుంటారా? అనుకున్నట్టుగానే ఉదయాన్నే పీసీసీ చీఫ్ ఇంటి ముందు వాలిపోయారు పోలీసులు. రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వామనంలో ఎక్కించుకుని.. సిటీ అంతా తిప్పారు. తొలుత లంగర్‌హౌస్ పీఎస్ వైపు తీసుకెళ్లి.. అక్కడి నుంచి గోల్కొండ పీఎస్‌కు తరలించారు. రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అక్రమం, అప్రజాస్వామికమని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్బంధకాండ అమలవుతోందన్నారు. సీఎం కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
- బీజేపీకి ఓటేయనివారి ఇంటిపైకి బుల్డోజర్!
- లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి కన్నుమూత
- తల్లి, తాతల మధ్య అక్రమ సంబంధం.. ముక్కుపచ్చలారని చిన్నారి బలి!
- కేసీఆర్ దూకుడు అందుకేనా? ఇంత పెద్ద స్కెచ్ ఉందా?
- ‘లింక్’ కట్…! నక్షబాట ను మింగిన అనకొండ లు
4 Comments