
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: ప్రభుత్వ నిషేధిత, హానికరమైన గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప హెచ్చరించారు. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలోని కరీమాబాద్, బొమ్మలగుడిలోని కిరాణం షాపుల్లో పక్క సమాచారం మేరకు గురువారం మిల్స్ కాలనీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.లక్షా 18 వేల 500 ఉన్నట్లుగా సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు, అంబర్ వంటివి ఆయా షాపుల్లో విక్రయిస్తున్నరన్న నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గుట్కాలను విక్రయిస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయించొద్దని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల యువత మత్తుకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కలకోట గిరికుమార్, మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్, మట్టేవాడ సీఐ రమేష్, ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజు- ఎమ్మెల్యే అరూరి
- అపర భగీరధుడు సీఎం కేసీఆర్
- రేవంత్ ను అరెస్ట్ చేసి సిటీ మొత్తం తిప్పిన పోలీసులు.
- ‘లింక్’ కట్…! నక్షబాట ను మింగిన అనకొండ లు