
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు సుభిక్ష పాలన అందించాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కలు నాటి, కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మల్లన్న దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నామన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారిందని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తోందన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజన్న ఎమ్మెల్యే అరూరి.. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్ అలీ, మండల కో ఆప్షన్ గుంశావలి, రైతు బంధు సమితి అధ్యక్షులు మజ్జిగ జైపాల్, నందనం సొసైటీ వైస్ ఛైర్మన్ చందర్ రావ్, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శి పోలేపల్లి శంకర్ రెడ్డి, బుర్ర రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్, ప్రచార కార్యదర్శి కోమలత, మండల యూత్ అధ్యక్షులు మరుపట్ల నరేష్, ఆలయ అభివృద్ధి చైర్మన్ మునిగాల సమ్మయ్య, మండల, బీసీ సెల్ అధ్యక్షులు విజయ్ భాస్కర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు పల్లంకొండ సురేష్, ఎస్సి సెల్ దుప్పెల్లి కొమురయ్య, స్థానిక ఎంపీటీసీ కల్పన మధుకర్, ఎంపీటీసీ తాటికాయల రమేష్, స్థానిక సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఉపసర్పంచ్ సతీశ్, గ్రామపార్టీ అధ్యక్షులు పరమేష్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
2 Comments