
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని వర్ధన్నపేట పట్టణ కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందించాలని ఇల్లంద రాజరాజేశ్వరి దేవాలయం, పట్టణ కేంద్రంలోని సాయిబాబా మందిరం, మసీద్, చర్చిలలో వర్ధన్నపేట జడ్పిటిసి మార్గం బిక్షపతి, మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, పిఏసిఎస్ చైర్మన్ రాజేష్ కన్నాలు ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటి, కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సుభిక్షంగా ఉండేవిధంగా ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం గొప్ప శుభసూచికం అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాలరావు, పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- రేవంత్ ను అరెస్ట్ చేసి సిటీ మొత్తం తిప్పిన పోలీసులు..
- కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజు- ఎమ్మెల్యే అరూరి
- బీజేపీకి ఓటేయనివారి ఇంటిపైకి బుల్డోజర్!