
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. యూపీ ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు ఆ ఎన్నికలపైనే ఫోకస్ చేశాయి. ప్రాంతీయ పార్టీలన్ని యూపీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని, బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తామని, వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడ్డారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రాజా సింగ్ చేసిన ఆ వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేస్తూ సెటైర్ వేశారు.
‘వారు నైతికంగా ఇంతకంటే దిగజారలేరు అని మీరు అనుకున్న సమయంలోనే.. బీజేపీ నుంచి మరో అద్భుతమైన హాస్యనటుడు ఒక్కసారిగా వెలుగులోకి వస్తాడు. మీరు బీజేపీకి ఓటు వేయకపోతే మీ ఇళ్లను యోగి బుల్డోజర్డతో కూల్చేస్తారని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
One Comment