
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచడంతో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. కేసీఆర్ మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని ఇప్పటికే పలు మీడియా సమావేశాలలో చెప్పారు. షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, అంతకు ఆరు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తామని అన్నారు. అదే క్రమంలో ఎన్నికల ముందు, ముందస్తుకు మించిన ‘చమత్కారం’ ఉంటుందనీ ప్రకటించారు. అయితే కేసీఆర్ ఏ మాట మాట్లాడిన, ఏ ప్రకటన చేసినా అది సంచలనమే అవుతుంది. ఒక విధంగా ఆయన రాజకీయ ఎజెండాను ఫిక్స్ చేస్తారు, ఇతర పార్టీల నాయకులు దాన్ని ఫాలో అయిపోతుంటారు.
కేసీఆర్ కాదన్నా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా గులాబీ వర్గాల్లో ముందస్తు చర్చ మహా జోరుగా సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ముందస్తుకు వెళితే ఉభయ తారకంగా మంచిదనే ఆలోచన చేస్తున్నారని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వరుస మీడియా సమావేశాలు, బహిరంగ సభల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనుక మర్మం అదే అనే అనుమానం టీఆర్‌ఎస్ వర్గాలలో వినవస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దూకుడు పెంచినా.. కాంగ్రెస్‌తో సంబంధం లేదంటూనే ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీకి అనూహ్యంగా మద్దతు పలికినా ఇవ్వన్నీ.. ముందస్తు రాజకీయ వ్యూహంలో భాగమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి వ్యూహరచన సాగుతోందని పార్టీ నేతలు చెపుతున్నారు.
Read More : రేవంత్ ను అరెస్ట్ చేసి సిటీ మొత్తం తిప్పిన పోలీసులు.. – Crime Mirror
పట్టుమని పది మంది ఎంపీలు లేకుండా జాతీయ రాజకీయాల్లో, అది కూడా ఉత్తర భారత రాజకీయ సమీకరణలను ఎదుర్కుని కేంద్రంలో చక్రం తిప్పడం అయ్యే పని కాదని కేసీఆర్ కు తెలుసు. అయితే రాష్టంలో అధికాన్ని నిలుపుకోవాలంటే, టీఆర్‌ఎస్-కాంగ్రెసే- బీజేపీ మధ్య త్రిముఖ పోటీ అవసరం. అందుకే బీజేపీని బరిలో దించేందుకు కేంద్రం పైనా, బీజేపే పైన కత్తులు దూస్తున్నారని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ తక్కువ చేసి చూపేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయ రచ్చ తెరమీదకు తెచ్చారని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం, రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడకుండా చూడటం కేసీఆర్ లక్ష్యాల్లో ముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసేఅర్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అదే జరిగితే ఆ ప్రభావం తెలంగాణపై పడుతుందని ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే కర్ణాటక అసెంబ్లీతోపాటు, తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలని టీఆర్‌ఎస్ వర్గాలు కోరుకుంటున్నాయని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం 2024, జనవరి 16న ముగుస్తుంది. అంతకంటే ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చు. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీతోపాటు ఇక్కడా ఎన్నికలు రావాలంటే ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో ఇక్కడ అసెంబ్లీని రద్దు చేయాలి. ఏడాది పదవీకాలాన్ని వదులుకోవాలి. అయితే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇవి కూడా చదవండి ..
- స్పందనకు వందనం – Crime Mirror
- నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్ల పట్టివేత
- అపర భగీరధుడు సీఎం కేసీఆర్
- కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజు- ఎమ్మెల్యే అరూరి
- బీజేపీకి ఓటేయనివారి ఇంటిపైకి బుల్డోజర్! – Crime Mirror