
- మూడు రోజుల పాటు కొనసాగనున్న సేవా కార్యక్రమాలు
- ఉత్సాహంగా పాల్గొంటున్న పార్టీ శ్రేణులు
క్రైమ్ మిర్రర్, పెద్దపల్లి ప్రతినిధి: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు, జయశంకర్ జిల్లా జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణీ-రాకేష్ ల పిలుపు మేరకు మహాదేవ్ పూర్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్ రావు ఘనంగా నిర్వహించాలని మండల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాదేవ్ పూర్ మండలకేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో లింగంపల్లి శ్రీనివాస్ రావు మండల పార్టీ శ్రేణులతో కలిసి పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు సంబరంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకుందామని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ మూడు రోజుల వేడుకలను టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్ రావు, మహాదేవ్ పూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, మహాదేవ్ పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కూరతోట రాకేష్, మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- బీజేపీ సీఎంపై హైదరాబాద్ లో కేసు.. కేసీఆర్ పంజా విసరబోతున్నారా?
- ఫ్లైట్లో వచ్చి సైకిల్ పై రెక్కి.. చోరీ చోసి రైళ్లో పరార్..
- ప్రాంతీయ పార్టీలు ఏకమవుతాయా? కేసీఆర్ కింగ్ మేకరవుతారా?
- హైదరాబాద్ లో సినిమా స్టైల్లో గ్యాంగ్ వార్.. ఇద్దరికి సీరియస్
- సాంబార్ గిన్నెలో పడి చిన్నారి మృతి.. బర్త్ డే వేడుకలో తీరని విషాదం