
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆదేశాల మేరకు నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద వరంగల్ ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. లైసెన్స్ లేని వారికి ఆటోలు అద్దెకు ఇవ్వరాదన్నారు.
రాత్రి పగలు తేడా లేకుండా సేవ చేస్తున్న ఆటో డ్రైవర్లకు అభినందనలు అని అన్నారు. ఎవ్వరూ కూడా మద్యం తాగి ఆటోలు నడుపరాదని, ఓవర్ లోడ్ ఎక్కించుకోరాదని ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపరాదని, ట్రాఫిక్ రూల్స్ (నిబంధనలు) ప్రతీ ఒక్కరు పాటించాలని, ఎవ్వరూ కూడా ఎక్కువ ట్రిప్పులు కొట్టాలని తొందరపడవద్దన్నారు. జాగ్రత్తలు పాటించాలని, ప్రతీ ఒక్కరూ తమ ఆటోలను రోడ్డు ప్రక్కన మాత్రమే ఆపి పార్క్ చేసుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ నిలుపడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఆటోలకు నెంబర్లు లేకుండా నడుపరాదని, రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడేలా ఉండాలని, ఆటోలకు నెంబర్ సిస్టమ్ ఉండడం వలన దొంగతనాలు, ప్రమాదాలు జరిగినప్పుడు తొందరగా గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వాహనాలను నడిపి గమ్యస్థలానికి చేరుకోవాలని తెలియజేశారు.
ఇవి కూడా చదవండి…
- ఫ్లైట్లో వచ్చి సైకిల్ పై రెక్కి.. చోరీ చోసి రైళ్లో పరార్..
- బీజేపీ సీఎంపై హైదరాబాద్ లో కేసు.. కేసీఆర్ పంజా విసరబోతున్నారా?
- సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభం
- హైదరాబాద్ లో సినిమా స్టైల్లో గ్యాంగ్ వార్.. ఇద్దరికి సీరియస్
2 Comments