MahabubnagarRangareddyTelangana

‘లింక్’ కట్…! నక్షబాట ను మింగిన అనకొండ లు

  • రియల్టర్ల కబందాల్లో నక్షబాట
  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
  • ఆందోళనలకు సిద్దమవుతున్న రైతాంగం

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, షాద్ నగర్/ కేశంపేట : ఓ మండలంలోని గ్రామం నుండి పక్క మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే నక్షబాట అది. ఎంతో కాలంగా రైతులు ఆ బాట వెంట రాకపోకలు సాగిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చేవారు. కాలక్రమేణా కొందరు రైతులు తమ అవసరాల కోసం పొలాలను విక్రయించారు. ఇక ఆ నక్ష బాటకు ఆనుకుని పొలాలు కొన్న రియల్టర్ ల కన్ను కాస్తా ఆ నక్షబాట పై పడింది. వెంటనే ఏమాత్రం జంకు లేకుండా దర్జాగా కబ్జా చేసేసిన రియల్ మాయగాళ్ల భాగోతమీది…

Trs, Congress : రేవంత్ రెడ్డికి షాకేనా? కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోతాయా? – Crime Mirror

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని పుట్టోని గూడెం గ్రామ శివారులో నక్షబాట కబ్జాకు గురయ్యింది. ఫరూక్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామ రోడ్డు నుండి కేశంపేట మండలం పుటోనిగూడెం గ్రామాన్ని కలుపుతూ దత్తాయిపల్లి గ్రామ రహదారికి ఉన్న నక్ష బాట అది. పూర్వీకుల నాటి నుండి రైతులు ఆ నక్షబాట నే వాడుతూ వచ్చారు. కాగా భూముల ధరలు పెరగడం, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడంతో రైతులు కొంతమంది తమ భూములను రియల్ వ్యాపారులకు అమ్ముకున్నారు. దీంతో లాభర్జనే ద్యేయంగా వ్యాపారం సాగించే రియల్ మాఫియా తమ భూములకు అనుకుని ఉన్న నక్షబాట ను యథేచ్ఛగా కబ్జా చేసేశారు. పుట్టోనిగూడెం గ్రామ శివారుకు ఫరూక్ నగర్ మండల శివారు ఆనుకుని ఉంటుంది. వెలిజర్ల గ్రామం నుండి ఫరూక్ నగర్ మండల శివారు వరకు ఉన్న నక్షబాట పుట్టో నిగూడెం గ్రామ శివారు వద్దకు వచ్చే సరికి మాయమయిపోయింది.

Read More : ఫ్లైట్లో వచ్చి సైకిల్ పై రెక్కి.. చోరీ చోసి రైళ్లో పరార్..

మా దాంట్లో లేదంటే ..మదాంట్లో లేదు

పుట్టోనిగూడెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 213, 219 మధ్యలో నుండి ఉండే ఈ నక్షబాట ను పూర్తిగా ఆక్రమించి రియల్టర్ లు ఎవరికి వారు ఫీనిషింగ్ చేసుకున్నారు. నక్ష బాట మా పొలంలో లేదని ఓ సర్వే నెంబర్ లో పొలం కొన్న రియల్టర్ అంటుంటే.. మా పొలాల్లో లేదని మరో సర్వే నెంబర్ లో పొలం కొన్న రియల్టర్ అంటున్నారు. మరి అందరూ బుద్ధి మంతులే అయితే మరి తప్పు చేసిందెవరు. నక్షబాట ను అనకొండల్లా మింగింది ఎవరు?. రెండు గ్రామాలను కలిపే నక్షబాట ను మధ్యలో దర్జాగా కబ్జా చేసిన ఆ భూ’మాయగాడే’వడో.! లోగుట్టు రియల్ మాఫియా కే ఎరుక.

నక్షబాట ను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

నక్ష బాట ను కబ్జా చేసి దర్జాగా దందా చేస్తున్న వ్యక్తులెవరో అధికారులు గుర్తించి వెంటనే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రియల్ వ్యాపారులు రైతుల నుండి పొలాలు కొనుగోలు చేసిన తరువాత అధికారులను మచ్చిక చేసుకోవడంతోనే ఇంత దర్జాగా నక్ష బాట కబ్జా చేశారంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. కబ్జాకు గురైన నక్ష బాట ను వెలికి తీసి రియల్ వ్యాపారులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతానని ఆయా గ్రామ శివారులో ఉన్న రైతులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. గీత కార్మికుడికి ఆర్థిక సహాయం ..
  2. తీగలపై తమ్ముళ్ళ ఒత్తిడి.. కాంగ్రెస్ లో చేరుదామని అంటున్న అనుచరులు
  3. బీజేపీ సీఎంపై హైదరాబాద్ లో కేసు.. కేసీఆర్ పంజా విసరబోతున్నారా?
  4. ఫ్లైట్లో వచ్చి సైకిల్ పై రెక్కి.. చోరీ చోసి రైళ్లో పరార్..
  5. ప్రాంతీయ పార్టీలు ఏకమవుతాయా? కేసీఆర్ కింగ్ మేకరవుతారా?

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.