
- పైడిపల్లిలో దివ్యాంగులకు 30 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
- ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరూరి
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: సీఎం కేసీఆర్ ప్రజా బంధావుడని, తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నాడని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పేర్కొన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహిస్తున్న మూడురోజుల వేడుకల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలో దివ్యాంగులకు, వృద్దులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం పైడిపల్లి గ్రామంలో దివ్యాంగుల కోసం 30 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ భూమి పూజ చేసి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడంలేదని, కేవలం తెలంగాణాలో ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. ఇక ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కూడా చాలా పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అవకతవకలకు చోటివ్వలేదని చెప్పారు. రాజకీయ జోక్యం కూడా లేకుండా చేశామని చెప్పారు. ప్రతి పేదవాడి ఆత్మగౌరవానికి డబుల్ బెడ్రూం ఇల్లు ప్రతీకగా నిలవాలన్నారు. నిర్మాణాన్ని అతిత్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జన్ను శిభారాణి, తూర్పాటి సులోచన, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- లైసెన్స్ లేని వారికి ఆటోలు అద్దెకు ఇవ్వరాదు- ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్
- ఫ్లైట్లో వచ్చి సైకిల్ పై రెక్కి.. చోరీ చోసి రైళ్లో పరార్..
- బీజేపీ సీఎంపై హైదరాబాద్ లో కేసు.. కేసీఆర్ పంజా విసరబోతున్నారా?
One Comment