
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆకుల కుమారస్వామి వృత్తిరీత్యా తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి తీవ్ర గాయలవడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమశాఖ, వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా మంగళవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వర్ధన్నపేట గౌడ సంఘ పెద్దలు తాళ్లపల్లి యాదగిరి, గ్రామ సభ్యుల ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ.15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ మాట్లాడుతూ.. కుల వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డ గీత కార్మికుడికి అండగా ఉంటామని తెలిపారు. పరామర్శించిన వారిలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శంకర్, రవీందర్ రెడ్డి, ఏబీసీడీవో, చంద్రశేఖర్, ఈవో తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
నెరవేరనున్న దివ్యాంగుల సొంత ఇంటి కల
ఆరోగ్యలక్ష్మి యాప్ పై ఐసీడీఎస్ సిబ్బందికి శిక్షణ
లైసెన్స్ లేని వారికి ఆటోలు అద్దెకు ఇవ్వరాదు- ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్