
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్స కోట (రెవెన్యూ), జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ శారద ఆధ్వర్యంలో ఆరోగ్యలక్ష్మి యాప్ ఒక రోజు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్స కోట అంగన్ వాడీలో పారదర్శకత, మెరుగైన సేవలను అందించుటకు, జవాబుదారితనం కోసం, టీచర్ యొక్క పనిభారాన్ని తగ్గించడానికి యాప్ రూపకల్పన చేశారని, ట్రైనింగ్ తీసుకొని చక్కగా అప్లికేషన్ ని ఉపయోగించాలని అంగన్ వాడీ టీచర్లకు తెలియజేశారు. ఈ సందర్భంగా యం.శారద మాట్లాడుతూ.. నిర్వహణను మరింత పటిష్టపరిచేందుకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పేరిట ప్రత్యేకంగా యాప్ ను ఏర్పరిచి అందుబాటులోకి తెచ్చిందన్నారు.
అంగన్ వాడీ సెంటర్ల సమాచారం, లబ్ధిదారుల నమోదు, హాజరు తదితర వివరాలన్నీ ప్రతిరోజు ఆన్ లైన్ లో నమోదు ఎలా, ఏ వివరాలు, ఏ విధంగా నమోదు చేయాలనే విషయమై అంగన్ వాడీ టీచర్స్ కు, సీడీపీవోలకు, సూపర్ వైసర్లకు, పొషన్ అభియాన్ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో మొత్తం అంగన్ వాడీ కేంద్రాలు 919, మినీ అంగన్ వాడీ కేంద్రాలు 847, మినీ మెయిన్ కలిపి 72 సెంటర్స్ ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా 47,278 మంది చిన్నారులు, గర్భినిలు 5,509 మంది బాలింతలు, 6,332 మందికి పౌష్టికాహారం వాటి పూర్తి వివరాలు పక్కాగా యాప్ పొందుపుస్తూ రోజువారీ అంగన్ వాడీ సేవల నిర్వహణ జరగనుందన్నారు. దీని కొరకు మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ నుండి డేటా అడ్మిస్ట్రేషన్ ఆఫీసర్ ఎన్.రవి కుమార్, ఉమేష్ ప్రత్యేకంగా వరంగల్ జిల్లాకు విచ్చేసి శిక్షణ ఇచ్చారని తెలిపారు. అంగన్ వాడీలకు ఆరోగ్య లక్ష్మి యాప్ ను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా పక్కగా అర్థం అయ్యేల శిక్షణ ఇచ్చారన్నారు.
అంగన్ వాడీ టీచర్లకు, సూపర్ వైజర్లకు ప్రభుత్వం ఇప్పటికే స్మాట్ ఫోన్లు అందజేసిందని, అంగన్ వాడీ టీచర్ హాజరు కూడా యాప్ లో నమోదు చేయనున్నారని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రంలో ఉన్న లబ్ధిదారులు ఎంత మందికి, ఏ పౌష్టికాహారంను ఎంత మంది తీసుకున్నారు, పిల్లల పెరుగుదల కేంద్రంలో ఉన్న సరుకుల నిల్వ మొదలగు వివరాలను రోజు వారిగా యాప్ లో నమోదు చేయనున్నారని తెలిపారు. అదే విధంగా అంగన్ వాడీ కేంద్రం కొనసాగుతున్న భవన పరిస్థితి సౌకర్యాలు సైతం ఇందులో పొందుపర్చానున్నారు. మ్యాన్యువల్ గా రిజిస్టర్ లలో వివరాలను నమోదు చేసే పనిభారం కూడా టీచర్లకు తగ్గనుందని తెలిపారు. ఏ రోజుకు ఆరోజే వెంటనే లబ్ధిదారుల నమోదు, హాజరు వివరాలను రిపోర్ట్ రూపంలో అధికారులు చూసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యలక్ష్మి యాప్ ద్వారా అంగన్ వాడీకి సంబంధించిన వివరాలన్ని ఆన్ లైన్ లో నే తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలోని ప్రతి అంగన్ వాడీ టీచర్ కు ఈ అప్లికేషన్ పై శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ఈ శిక్షణలో సీడీపీవోస్ శ్రీదేవి, రాధిక, విశ్వజ, పోషణ అభియాన్ డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్ కార్తీక్, జిల్లా సూపర్ వైసర్స్, పోషనభియాన్ సిబ్బంది, ప్రతి సెక్టార్ నుంచి ఒక అంగన్ వాడీ టీచర్ సహా మొత్తం 37 మంది టీచర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…