TelanganaWarangal

లక్ష్యాన్ని మించి రెట్టింపుగా లీడ్ బ్యాంక్ రుణాలు

వరంగల్ లీడ్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి

  • వర్షాలకు పంటలు నష్ట పోయిన రైతులందరికీ లోన్ రీ -షెడ్యూల్, కొత్త క్రాప్ లోన్లు
  • గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వరంగల్ జిల్లాకు పీఎం అవార్డు రావాలి
  • ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 18 వరకు ఆర్భీఐ ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలు
  • అన్ని గ్రామీణ బ్యాంకు శాఖల్లో గో-డిజిటల్, గో-సెక్యూర్ నినాదంతో డిజిటల్ లావాదేవీలు
  • బ్యాంకు, ప్రభుత్వ అధికారులు సమన్వయముతో పనిచేయాలి
  • దళితబంధు లబ్దిదారులకు చేయూతనివ్వండి

క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా మొత్తం ఋణాల పంపిణీ లక్ష్యం రూ. 2 వేల 744 కోట్లు కాగా, రూ. 4 వేల 36 కోట్లు లక్ష్యానికి మించి రెట్టింపు రుణాలు ఇచ్చిన బ్యాంకర్లను, జిల్లా అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. వ్యవసాయ, పరిశ్రమల ఋణాలు అధికంగా ఉండటం అభినందనీయం అన్నారు. వ్యవసాయ రుణాల లక్ష్యం 1 వేయి 233.13 కోట్లు కాగా 1 వేయి 350.40 కోట్ల ఋణాలు, పరిశ్రమలకు 702.88 కోట్ల లక్ష్యం కాగా, 754.81 కోట్ల ఋణాలు మంజూరు చెయ్యడం పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతోషం వ్యక్తం చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, వెంటనే కొత్త ఋణాలు మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాల గ్రౌండింగ్ వేగంగా చేయాలని చెప్పారు. వరంగల్ లీడ్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో డిజిటల్ బ్యాంకింగ్ పోస్టర్లను మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మొత్తం ప్రాధాన్యత రంగాలకు 2 వేల 482 కోట్ల 60 లక్షల ఋణాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ టర్మ్ లోన్లు ఇవ్వడం ఇంకా వేగవంతం చెయ్యాలన్నారు. మొత్తం రూ.550 కోట్లకు గాను రూ.245 కోట్లు ఇచ్చారని, ఇంకా రూ.205 కోట్లు తొందరగా పూర్తి చేయాలని సూచించారు. 2019-20 ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వరంగల్ జిల్లా ప్రధాన మంత్రి అవార్డుకు ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. సెంట్రల్ బాంక్ ఆఫ్ ఇండియా, బాంక్ అఫ్ బరోడా, బాంక్ అఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బాంక్, ఇండియన్ ఓవర్సీస్ బాంక్, ప్రైవేటు బ్యాంకులలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, కోటక్ మహేంద్ర బ్యాంకు మరియు కర్ణాటక బ్యాంకులు ఋణాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నదని, అలాంటి బ్యాంకులపైన తగిన చర్యలు తీసుకొని పై అధికారులకు తెలియజేయాలని చెప్పారు.

మహిళా స్వయం సహాయక సంఘాల ఋణ మంజూరులో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 328.13 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 337.34 కోట్ల ఋణాలు మంజూరు చెయ్యడం జరిగిందని, ఈ ఘనత సాధించిన బ్యాంకు అధికారులకు, జిల్లా అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ ను మంత్రి అభినందించారు. మత్స్య కారులకు, గొల్ల, కుర్మలకు, పాల ఉత్పత్తి దారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఎన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లాలోనే ఎక్కువగా ఇవ్వడం జరిగిందన్నారు. KCC మత్స్యకారులకు 456 లోన్లు, గొల్ల కుర్మలకు, పాలఉత్పత్తి దారులకు 333 లోన్లను మంజూరు చేపించడం జరిగిందని మంత్రి వివరించారు. కరోనా కష్టకాలంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బ్యాంకు మేనేజర్ల సహాయంతో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వడం పట్ల మంత్రి వారిని అభినందించారు.

14 ఫిబ్రవరి నుండి 18 ఫిబ్రవరి వరకు RBI ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా, అన్ని గ్రామీణ బ్యాంకు శాఖలలో గో డిజిటల్, గో సెక్యూర్ అనే నినాదంతో డిజిటల్ లావాదేవీలు, వాటి భద్రత గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించుకోనున్నారు. ఈ నేపథ్యంలో SC, ST, PMEGP ముద్ర, స్టాండ్ అప్ ఇండియా ఋణాలు అర్హులైన అందరికీ అందజేయాలని మంత్రి అధికారులకు చెప్పారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజురైన ఎస్సీ కార్పొరేషన్ ఋణాలు 405 మందికి 35 కోట్ల లక్ష్యానికి 233 మంది లబ్దిదారులకు 19 కోట్ల మాత్రమే గ్రౌండింగ్ చేశారన్నారు. పెండింగ్ 175 పూర్తి చేయాలని, గిరిజన సంక్షేమం క్రింద 640 యూనిట్లు 40 కోట్లకు గాను 609 యూనిట్లు 39 కోట్లు గ్రౌండింగ్ పూర్తి చేశారన్నారు. పెండింగ్ ను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అదేశించారు. ట్రైబల్ వెల్ఫేర్ కు ఈ సంవత్సరం లక్ష్యం 1 వేయి 118 యూనిట్లు 31 కోట్లు ఋణాలు మంజూరు చేయాలని తెలిపారు. మినీ డైరీ పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొకరికి రెండు గేదెలు (2లక్షలు) చొప్పున రాయపర్తి, నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు బ్యాంకర్స్ ముందుకు వచ్చి మంజూరు చేయాలన్నారు. మినీ డైరీ పథకం క్రింద రెండు గేదెలు ఇచ్చినవారికి మిగతా రెండు గేదెలను ఇవ్వాలన్నారు.

ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు నష్ట పోయిన రైతులందరికీ లోన్ రీ షెడ్యూల్ చేసి కొత్త క్రాప్ లోన్లు ఇవ్వాలని మంత్రి కోరారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ బ్యాంక్ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, RBI, లీడ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇతర బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

  1. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు- ఎస్సై రామారావు
  2. రాజ్యాంగం మార్చాల్సిందే.. మాటంటే మాటేనన్న కేసీఆర్
  3. చినజీయర్ తో కేసీఆర్ కు చెడిందా ? శిలాఫలకంపై పేరు గల్లంతు అందుకేనా?
  4. యూపీ ఎన్నికలకు కేసీఆర్ డబ్బుల సంచులు!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.