
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణకేంద్రానికి చెందిన బీజేపీ పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, పలువురు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గోధుమల మధుసూదన్, దీకొండ యుగేంధర్, జూలూరి రమేష్ లకు ఎమ్మెల్యే అరూరి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సారధ్యంలో అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…