
- వేలకు వేలు జీతాలు తీసుకుంటూ డ్యూటీలకు డుమ్మాలు
- పలు ఆరోపణల దృశ్య మండిపడ్డ మెండు
- చర్లగూడెం పాఠశాలకు తక్షణమే ఉపాధ్యాయులను పంపాలి
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి: మండల విద్యాధికారి అయిన ఎంఈవో, వారి సిబ్బంది కనీసం కార్యాలయం కూడా తెరవకుండా నిర్లక్ష్యం వహించిన తీరుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి నల్లగొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. చర్లగూడెం గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సోమవారం ఎంఈవో కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీపీ.. సమయం మధ్యాహ్నం 12 గంటలు గడిచినప్పటికీ కార్యాలయం మూసేసి ఉండటంతో తీవ్రంగా మండిపడ్డారు. కనీస బాధ్యత కూడా వహించని మండల అధికారి ఇక పిల్లలకేం న్యాయం చేస్తారని అన్నారు. వీరిపై వెంటనే కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. చదువుకునే పిల్లలు ఉన్నప్పటికి ఉపాధ్యాయులు రాకపోవటంతో స్కూల్ మూసేశారని, దీని వల్ల పేద ప్రజలు పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ కి పంపలేక, ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని గమనించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి ఉపాధ్యాయులని పంపాలని సూచించారు. అనంతరం రాజాపేట తండా పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల యూత్ ఉపాధ్యక్షులు కుక్కల మహేందర్, రాజాపేట తండా స్కూల్ ఛైర్మెన్ శంకర్, గ్రామ పెద్దలు బొడ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…