
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో దేశంలోని కోట్లాది మంది పేదలు జన్ ధన్ ఖాతాలు తెరిశారు. అయితే ఓ రైతు జన్‌ధన్ ఖాతాలోకి ఒక్కసారిగా రూ. 15 లక్షలు వచ్చి పడ్డాయి. దీంతో సంబరపడిపోయాడు ఆ రైతు. జన్ ధన్ ఖాతాలోకి ప్రధాని మోడీ వేశారని భావించాడు. వెంటనే ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం రూ. 9 లక్షలు ఖర్చు చేశాడు. మిగిలిన 6 లక్షల రూపాయలను ఏం చేయాలా? అని ఆలోచనలో పడ్డాడు. తర్వాతే అసలు సంగతి తెలిసింది. షాకై కూర్చున్నాడు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్‌వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్దన్ ఔటే రైతు. గతంలో ఒకసారి తన జన్‌ధన్ ఖాతా చెక్ చేసుకుంటే అందులో రూ. 15 లక్షలు కనిపించాయి. అంతసొమ్ము తన ఖాతాలో కనిపించడంతో తొలుత షాకైన జనార్దన్.. ఆ సొమ్మును ప్రధాని మోదీ తన ఖాతాలో వేశారని భావించి ధన్యవాదాలు చెబుతూ ప్రధాని కార్యాలయానికి ఈమెయిల్ పంపాడు. తన ఖాతాలో ఉన్న రూ. 15 లక్షల నుంచి రూ. 9 లక్షలు డ్రా చేసి ఇల్లు కట్టుకున్నాడు.
ఇటీవల ధ్యానేశ్వర్‌కు గ్రామ పంచాయతీ నుంచి ఓ లేఖ అందింది. జిల్లా పరిషత్ నుంచి పింప్‌వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాకు బదిలీ అయ్యాయని, వెంటనే ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులు అందులో పేర్కొన్నారు. ఆ లేఖ చదివిన ధ్యానేశ్వర్‌కు నోటమాట పడిపోయినంత పనైంది. ఆ వెంటనే తేరుకుని ఖాతాలో మిగిలి ఉన్న రూ. 6 లక్షలను వారికి చెల్లించాడు. మిగతా రూ. 9 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక తల బద్దలుగొట్టుకుంటున్నాడు.ఐదు నెలల తర్వాత తేరుకున్న అధికారులు నిదానంగా ఈ లేఖ పంపడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి …
- మంత్రి సబితమ్మకు షాక్ … సొంత ఇలాక లో చైర్మన్ బిజెపి లోకి జంప్
- ఒక్కరోజే అదానీ టాప్.. మళ్లీ నంబర్ 1గా అంబానీ
- భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..
- తెలంగాణ బీజేపీకి మోడీ షాక్.. కేసీఆర్ కోసమే అలా చేశారా?
- హైదరాబాద్ కు పాకిన హిజబ్ రచ్చ.. అసలు వివాదం ఎందుకొచ్చింది?
2 Comments