
- గేటు మూసివేయడంతో పలు వాహనాల నిరీక్షణ
- ఇబ్బంది పడ్డ నిండు గర్భిణీ
- స్పందించిన సీఐ కిరణ్..గర్భిణీ మహిళ సేఫ్
మహాదేవ్ పూర్, క్రైమ్ మిర్రర్ : మండలంలోని అంబట్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేడిగడ్డ అంతరాష్ట్ర వంతెన వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది, వివారాల్లోకి వెలితే తెలంగాణ కు మహారాష్ట్ర కు సరిహద్దు ప్రాంతం అయిన మేడిగడ్డ అంతరాష్ట్ర వంతెన మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సాయంత్రం సమయంలో రాకపోకలు నిలిపివేస్తున్నారు. ఇదే క్రమంలో మహారాష్ట్ర లోని సోమునూర్ గ్రామం నుండి నిండు గర్భిణీ మహిళ వాహనం వంతెన వద్ద సుమారు గంటకు పైగా నిరీక్షిస్తూ ఇబ్బంది పడవలసి వచ్చింది.
Read More : ప్రధాని అయినా డోంట్ కేర్… కేసీఆర్ తీరుపై రాజకీయ రచ్చ!
స్థానిక వాహనదారుల ద్వారా విషయం తెలుసుకున్న ‘క్రైమ్ మిర్రర్’ ప్రతినిధి మహాదేవ్ పూర్ సీఐ కిరణ్ కు సమాచారం అందించగా వెంటనే స్పందించిన సీఐ గేట్లు తెరిపించి గర్భిణీ మహిళను మహాదేవ్ పూర్ లోని సామాజిక హాస్పిటల్ కు తరలించుటలో సహాయం చేసారు దీంతో మహిళ కుటుంబసభ్యులతో పాటు స్థానికులు సీఐ కిరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి ..
- బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఫైనల్… ఫిబ్రవరిలోనే షురూ..
- ఏపీ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణమా.. మంత్రి పేర్నినాని చెప్పిన నిజం
- గానకోకిల లతా మంగేష్కర్ మృతి.. ప్రముఖుల సంతాపం
- ఒవైసీపై దాడి.. పీకే ప్లానేనా? కేసీఆర్ కు లింకుందా?
One Comment