
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉత్తర్ ప్రదేశ్‌లో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకని ఢిల్లీకి బయల్దేరిన ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసిపై దాడి జరిగింది. మీరట్‌కి సమీపంలోని కితౌర్‌లో ప్రచారం ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి వెళ్తుండగా చాజర్సి టోల్ గేట్ వద్ద అసదుద్దీన్ ఒవైసి ప్రయాణిస్తున్న కారుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దుండగులు తన కారుపై మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడినట్టు అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. దుండగుల కాల్పుల్లో కారు టైరు పంక్చర్ అవడంతో పాటు బుల్లెట్ల ధాటికి కారు పాక్షికంగా దెబ్బతిన్నట్టు కారు దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది.
Read More : ఎంపీ అసద్ పై కాల్పులు.. క్షేమంగానే ఉన్న హైదరాబాద్ ఎంపీ
కాల్పుల కలకలం అనంతరం మరో కారులో ఢిల్లీకి బయల్దేరిన అసదుద్దీన్ ఒవైసి.. దాడికి సంబంధించిన విషయాలను ట్విటర్ ద్వారా, మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తన అనుచరులు, పార్టీ కార్యకర్తలకు తెలిపారు. తాను మరో కారులో ఢిల్లీకి బయల్దేరినట్టు అసదుద్దీన్ ఒవైసి.. తెలిపారు.
Priyudu : ప్రియుడి మోజులో భర్తను క్రూరంగా చంపేసి.. పాము కాటుగా కలరింగ్ – Crime Mirror
అసదుద్దీన్ ఒవైసిపై జరిగిన ఈ దాడి సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆయన సొంత సోదరుడు, ఎంఐఎం పార్టీలో మరో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసిపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుకుచేసింది. 2011 ఏప్రిల్ 30న తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చాంద్రాయణగుట్ట పరిధిలోని కార్వాన్‌లో జరుగుతున్న ఓ ర్యాలీకి వెళ్తున్న క్రమంలోనే అక్బరుద్దీన్ ఒవైసిపై దుండుగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పులకు పాల్పడటంతో ఆగని దుండగులు.. అనంతరం కత్తులు, డాగర్లతోనూ అక్బరుద్దీన్‌పై, ఆయన అనుచరులపై దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో అక్బరుద్దీన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి గన్ మెన్ జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు దుండగులు హతమయ్యారు. అక్బరుద్దీన్ ఒవైసిపై దాడికి పాల్పడింది ఎంబీటీ పార్టీకి చెందిన మొహమ్మద్ పహిల్వాన్‌గా పోలీసుల విచారణలో తేలింది. ఓ ఆస్తి వివాదమే అక్బరుద్దీన్‌పై దాడికి కారణమైనట్టు అప్పట్లో తేలింది. తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసిపై జరిగిన కాల్పుల దాడి ఈ పాత ఘటనను మరోసారి గుర్తుచేసింది.
ఇవి కూడా చదవండి..
- నాడు మిలియన్ మార్చ్.. నేడు చలో విజయవాడ!
- డోలో 650తో సైడ్ ఎఫెక్ట్స్.. బీ అలర్ట్
- మేడారం జాతరలో బెల్లమే బంగారం.. దాని మహిమ ఏంటో తెలుసా?
- నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్… “కోటి సంతకాల సేకరణ”
One Comment