
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కేంద్ర బడ్జెట్ పై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన కామెంట్లు చేశారు. మోడీని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలు చేశారు. కేసీఆర్ మీడియా సమావేశం చూసిన వారంతా ఆయన మాట్లాడిన మాటలకు షాకయ్యారు. మోడీని తిడుతున్న క్రమంలో భారత రాజ్యాంగం పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. రాజ్యాంగం గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పెద్ద దుమారమే రేగుతోంది. బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. కాంగ్రెస్ కూడా రెండు రోజుల నిరసనకు పిలుపిచ్చింది.
కేసీఆర్ కామెంట్లు తెలంగాణలో రచ్చ రాజేస్తుండగా… ఏపీలో మంట పుట్టిస్తున్నాయి. కేసీఆర్ మాటలకు ఏపీ సీఎం జగన్ కు ఇబ్బందిగా మారుతున్నాయి. కేసీఆర్ ప్రసంగంపై ఏపీ తెలుగుదేశం పార్టీ నాయకులు రియాక్టవుతున్నారు. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అని కేసీఆర్ విలేకరుల సమావేశంలో చేసిన కామెంట్లపై టీడీపీ నేత మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ అలా మాట్లాడటం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ తో పాటు దేశ ప్రజలను అవమానించటమేనని జవహర్ ఆరోపించారు.
Read More : నీకో దండం జగన్.. కడప జిల్లాలో పోస్టర్ల కలకలం.. – Crime Mirror
దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకనుగుణంగా నాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్న జవహర్ 75 ఏళ్ల నుంచి ప్రజల హక్కుల్ని స్వేచ్చను కాపాడుతూ వస్తున్న రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు ఖండించలేదని జవహర్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి కూడా కేసీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తున్నారా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో రాజ్యాంగాన్ని మారిస్తే..ఏపీలో చట్టబద్దంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ మౌనంగా ఉండటం సరికాదని వ్యాఖ్యానించిన కేఎస్ జవహర్ కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కెఎస్ జవహర్ కామెంట్లు అధికార వైసీపీకి ఇబ్బందిగా మారాయనే చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి ..
- కేసీఆర్ బూతు పురాణం ఎందుకు? ఆయన అసలు టార్గెట్ ఏంటీ?
- జిన్నా టవర్ కు జాతీయ రంగులు.. వివాదం ముగిసినట్టేనా?
- ఆ ప్రాంతాల నుంచే గంజాయి రవాణా పెరిగింది : ఎస్పీ సునీల్ దత్
- లక్షల కోట్లు ముంచినవాళ్లకు రాయితీలా.. సిగ్గు లేదా మోడీ !
One Comment