
మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): శివన్నగూడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపుకు గురి అవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులకు ఆర్డిఓ గోపిరామ్, ప్రాజెక్ట్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో స్ట్రక్చర్ వ్యాల్యూ ప్రకారం నష్ట పరిహారం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాదాపు 200 కుటుంబాలకు నష్ట పరిహారం అందియనున్నట్లు, 21 మే 2021 రోజున చేసిన సర్వే ఆధారంగా, నర్సిరెడ్డిగూడెం గ్రామస్థులకు చెక్కులు పంపిని చేస్తున్నామని అన్నారు.
సర్వే నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని,భూ నిర్వాసితులకు వీలైనంత త్వరగా ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ కూడా వచ్చేలా చూస్తామని అన్నారు. నష్ట పరిహారం తీసుకురావటంలో కృషి చేసిన రాఘవ కన్స్ట్రక్షన్ యాజమాన్యానికి, ప్రాజెక్ట్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులకు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివన్నగూడెం ఎంపిటిసి మమతగోపాల్, ఈఈ రాములు, డిఈఈలు జె. కాశీం,లక్ష్మయ్య, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- మేడారం జాతరలో నిలువు దోపిడీ! అధికారులకు వాటా?
- సిద్దిపేటలో కాల్పులు.. 43 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
- చిరంజీవి, పవన్ కల్యాణ్ కు కొత్త చిక్కులు!
- అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ
- టీఆర్ఎస్ నేత దారుణ హత్య… తల, మొండెం వేరు చేసిన కిరాతకులు
2 Comments