
క్రైమ్ మిర్రర్, సిద్ధిపేట : సిద్దిపేటలో కాల్పుల కలకలం రేగింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద తుపాకీతో కాల్పులు జరిపి రూ. 43 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్దిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు నరసయ్య. తనతోపాటు రూ.43 లక్షల నగదును తీసుకొచ్చాడు. కారు డ్రైవర్ పరుశురామ్ కు డబ్బును చూసుకోమని చెప్పి..కార్యాలయం లోపలికి వెళ్లాడు. అనంతరం ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి..కారు డ్రైవర్ వైపు ఉన్న అద్దాన్ని పగులగొట్టారు.
దుండగులను గమనించిన డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా..అతడిపై దుండగలు కాల్పులు జరిపి…నగదును దోచుకెళ్లారు. డ్రైవర్ పరుశురామ్ గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. నరసయ్య భూ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏదైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- చిరంజీవి, పవన్ కల్యాణ్ కు కొత్త చిక్కులు..!
- మార్చి 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్..
- అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ
- మేడారం జాతరలో నిలువు దోపిడీ! అధికారులకు వాటా?
4 Comments