
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జిల్లాల విభజన ఆంధ్రప్రదేశ్ లో సెగలు రేపుతోంది. కొత్త వివాదాలకు కారణమవుతోంది. కొందరు తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తే. మరికొందరు తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అంటున్నారు. ఇంకొందరు జిల్లాల పేర్లపై మండిపడుతున్నారు. జిల్లాల పేర్లు మార్చాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా జిల్లాల విభజన సెగ మెగా ఫ్యామిలీని తాకింది. వాళ్లను తీవ్ర ఇరకాటంలో పడేస్తోంది.
విజయవాడ జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జిల్లాగా పేరు పెడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే ఇప్పుడు మెగా బ్రదర్స్ కు ఇబ్బందిగా మారుతోంది. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్న కాపు నేతలు.. ఈ అంశంలోకి చిరంజీవి, పవన్ కల్యాణ్ ను లాగారు .రంగా రీ ఆర్గనైజేషన్ పేరిట విశాఖలోని ఓ హోటల్లో కాపు నేతలు సమావేశమయ్యారు. విజయవాడ కు వంగవీటి రంగా పేరు పెట్టాలని సీఎం జగన్ ని కోరుకుతున్నామని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మెగా బ్రదర్శ్ కు లింకు పెట్టారు కాపు నేతలు. వంగవీటి రంగా పేరును విజయవాడకు పెట్టాలనే డిమాండ్ పై మెగా స్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించాలని కాపు నేతలు కోరారు.
Read More : పెన్సిల్ ఎత్తుకెళ్లాడని పిల్లాడు ఫిర్యాదు.. కేసు పెట్టాలని రచ్చ – Crime Mirror
విజయవాడ ప్రజలకు వంగవీటి రంగా ఎనలేని సేవలు చేశారని కాపు నేతలు గుర్తు చేస్తున్నారు. అందుకే ఆయన పేరు పెట్టడమే సరైంది అంటున్నారు. ఎన్టీఆర్ గుడివాడలో పుట్టారు. అది మచిలీపట్నం జిల్లా .. కనుక విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టడం సరైన నిర్ణయమని పవన్ కళ్యాణ్, చిరంజీవి లు కూడా ఈ విషయం పై స్పందించాలని కోరారు. గుడివాడలో పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కోసం దీక్ష చేపట్టి రంగా చనిపోయారని.. విజయవాడ ప్రజలకు వంగవీటి రంగా ఎనలేని సేవలు చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం కచ్చితంగా విజయవాడకు రంగా పేరు పెట్టి తీరాలన్నారు. చాలా మంది రంగా పేరు వాడుకుంటున్నారు తప్ప దీనిపై ఎవరు మాట్లాడం లేదన్నారు. చిరంజీవి సీఎం జగన్ దగ్గరకి వెళ్లి కేవలం సినిమా విషయమే కాకుండా ఈ విషయం పై మాట్లాడాలని సూచించారు కాపు నేతలు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అయినా.. సినిమా ఇండస్ట్రీలో బలమైన వ్యక్తులు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఆరాధ్య దైవం. కాబట్టి ఎన్టీఆర్ పేరు తొలగించి రంగా పేరు పెట్టాలని వారు డిమాండ్ చేయడం కష్టమే. మరీ మెగా బ్రదర్స్ ఈ విషయంలో మౌనంగా ఉంటే కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ..
ఇవి కూడా చదవండి ..
- సిద్దిపేటలో కాల్పులు.. 43 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
- మార్చి 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్..
- అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ
- మేడారం జాతరలో నిలువు దోపిడీ! అధికారులకు వాటా?
One Comment