
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనర్హత విషయంలో మరో కీలక అడుగు పడింది. వైసీపీ విప్ మార్గాని భరత్ ఇచ్చిన ఫిర్యాదును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేపథ్యంలో ఫిబ్రవరి 3న సమావేశం కానుంది. ఆ భేటీలో రఘురామ అనర్హత పిటిషన్ పై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఎంపీ రఘురామ కూడా మరోసారి రెచ్చిపోయారు. ధ్మముంటే తనపై అనర్హత వేటు వేయించాలంటూ వైసీపీకి మరోసారి సవాల్ విసిరారు.
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, రఘురామ తాజా డెడ్ లైన్ తో మరో చర్చ తెరపైకి వచ్చింది. ఆయన త్వరలో రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. జనవరి 31 సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగిస్తారు. మంగళవారం ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడతారు… ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన.. ఆపైన బడ్జెట్ పైన చర్చలు, రొటీన్ కార్యకలపాలు ఉంటాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే, ఇంచుమించుగా రెండు సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామా కృష్ణం రాజు సాగిస్తున్న రచ్చబండ రాజకీయ పోరాటం కొత్త మలుపు తీసుకుంటుందని అంటున్నారు.
Read More : అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ – Crime Mirror
రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ చాలా కాలం క్రితమే స్పీకర కు ఫిర్యాదు చేసింది. పార్టీ గుర్తు పైన ఎంపీగా గెలిచి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ పార్లమెంటరీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి.. లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి.. విప్ మార్గాని భరత్ స్పీకర్ కు పలు ఆధారాలు సమర్పించారు.అయినా ఎందుకనో స్పీకర్ కార్యాలయం స్పందించలేదు. ఈ నేపధ్యంలోనే రఘురామా వైసీపీకి సవాలు విసిరారు. దమ్ముంటే, చేతనైతే ఫిబ్రవరి 5 లోగా, స్పీకర్ తనను అనర్హునిగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని సవాలు విసిరారు. వైసీపీకి తనను అనర్హునిగా ప్రకటించేలా చేయడం చేతకాక పొతే, ఫిబ్రవరి 5 తర్వాత తానే రాజీనామా చేస్తానని చెప్పారు. అంతే కాదు నర్సాపురం నుంచి మళ్ళీ పోటీ చేసి గెలుస్తానని చెప్పారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోగా అటో ఇటో నిర్ణయం రావచ్చని అంటున్నారు. అయితే, రఘురామ కృష్ణం రాజు అంతవరకు అగకుండా ఫిబ్రవరి 5 ఒకటి రెండు రోజులు అటూ ఇటుగా ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. రఘురామ కృష్ణం రాజు ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏపార్టీలో చేరతారు? ఏపార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు? అనేది మాత్రం ఇంతవరకు అయన చెప్పలేదు. అయితే, ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం అయితే బలంగా సాగుతోంది. అలాగే, ఆయన ఏ పటీలో చేరరని, ఉప ఎన్నికలవరకు అందరివాడుగా ఉండి పోతారని, ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తారని అంటునారు.
ఇవి కూడా చదవండి ..
- అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ
- మేడారం జాతరలో నిలువు దోపిడీ! అధికారులకు వాటా?
- టీఆర్ఎస్ నేత దారుణ హత్య… తల, మొండెం వేరు చేసిన కిరాతకులు
- బీజేపీకి షాకేనా.. కాంగ్రెస్ గల్లంతేనా? ఐదు రాష్ట్రాలపై లేటెస్ట్ సర్వే..
2 Comments