
క్రైమ్ మిర్రర్, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో కిరాతకం జరిగింది. ఓ వ్యక్తి తల, మొండెం వేరు చేసి దారుణంగా హత్య చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీడీఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని టీఆర్ఎస్ పార్టీ మండల ఎస్టీ సెల్ ప్రెసిడెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు నాయక్ గా పోలీసులు గుర్తించారు. ఇంద్రకరణ్ పరిసరాల్లో రాజు నాయక్ ను హత్య చేసి తల భాగాన్ని రాయికోడ్ మండలంలోని కుసునుర్ గ్రామ శివారులో పడేశారు దుండగులు. న్యాకల్ మండలం రాఘపూర్ గ్రామ శివారులోని మంజీరా బ్రిడ్జ్ పరిసరాల్లో మొండెం ను పడేసి వెళ్లారు
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలిమెల తండాకు చెందిన కడావత్ రాజునాయక్ ఈ నెల 26న కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబసభ్యులు బీడీఎల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 27న స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు శనివారం ఉదయం సమయంలో హత్యకు (Be Headed) గురైనట్లు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండింటిని స్వాధీనం చేసుకున్నారు.
Read More : రేవంత్ రెడ్డి దెబ్బకు ప్రగతిభవన్ షేక్! – Crime Mirror
హత్య కేసులో భాగంగా పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో గోపాల్ నాయక్ (మృతుని తమ్ముడు), రాంసింగ్ (మృతుడు రాజు నాయక్ తో భూ విభేదాలు), మహేష్, బాలు, మల్లేష్ తదితరులు ఉన్నారు. ఈ హత్య కు భూ తగాధా కారణంగా తెలుస్తుంది. 32 గుంటల భూమి కోసం గతంలో కడవత్ రాజు నాయక్, రాంసింగ్ నాయక్ మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి ..
- మేడారం జాతరలో నిలువు దోపిడీ! అధికారులకు వాటా?
- అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ
- కరీంనగర్ లో కారు బీభత్సం.. గుడిసెలో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం
- తెలంగాణలో ముందస్తు ఎన్నికలు! కేసీఆర్ స్కెచ్ ఇదేనా..?
One Comment