
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కరీంనగర్‌లో ఓ కారు ఈ తెల్లవారుజామున బీభత్సం సృష్టించింది. కమాన్ చౌరస్తా వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి ..
- సిద్దిపేటలో కాల్పులు.. 43 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
- చిరంజీవి, పవన్ కల్యాణ్ కు కొత్త చిక్కులు!
- మార్చి 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్.. – Crime Mirror
- అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ
One Comment