
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. పార్టీలు దూకుడు పెంచడం కూడా ఇందుకు బలాన్నిచ్చాయి. ముఖ్యంగా ప్రగతి ఫాంహౌజ్‌కు పరిమితమయ్యే సీఎం కేసీఆర్ జిల్లాలు చుట్టేస్తుండటం, చాలా కాలంగా పెంగులో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించడంతో ముందస్తు ఎన్నికల కోణంలోనే కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికర పక్షంలో కన్నా కూడా ప్రతిపక్షాల్లోనే ఈ చర్చ జోరుగా సాగుతోంది. అంతర్గత సమావేశాల్లో ఆయా పార్టీల తమ క్యాడర్‌కు ఈ మేరకు దిశానిర్ధేశం కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని, ఈ మేరకు తమ వద్ద సమాచారం లేదని శ్రేణులకు ఆయా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖామమన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. గుజరాత్ ఎన్నికలతో పాటే సీఎం కేసీఆర్ కూడా ఎన్నికలకు వెళ్లేందుకు స్కెచ్ వేస్తున్నారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ వస్తున్న వార్తలపై తనదైన శైలిలో స్పందించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేసీఆర్ కేంద్రంపై కొట్లాట ఏపీ రెస్ట్ తీసుకున్నారు. ఒక వేళ యూపీ ఎన్నికల్లో బీజేపీకి నష్టం వాటిల్లితే ప్రభుత్వాన్ని రద్దు చేసి గుజరాత్ ఎలక్షన్స్ తో పాటు కేసీఆర్ ఎన్నికలకు వెళ్తాడని జోస్యం చెప్పారు. గుజరాత్ లో జరిగే ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా అక్కడే ఉంటారని.. తెలంగాణపై ఆ సమయంలో శ్రద్ధ చూపే అవకాశం వారికి ఉండదన్నది కేసీఆర్ ఆలోచన అని రఘునందన్ వివరించారు.
Read More : మేడారం జాతరలో నిలువు దోపిడీ! అధికారులకు వాటా? (crimemirror.com)
అయితే యూపీలో తాము ఓడిపోతామన్నది కేసీఆర్ భ్రమ మాత్రమే అని రఘునందన్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వారంలోనే వంద మంది అభ్యర్థులను బరిలో దించి మంచి విజయాలు సాధించారని ఆయన గుర్తు చేశారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 23 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినట్లు రఘునందన్ రావు వివరించారు. తమ పార్టీలో అభ్యర్థుల కొరత లేదని సాగుతున్న ప్రచారాన్ని ఆయన పారేశారు. ఒక్కో స్థానానికి, ముగ్గురు అభ్యర్థులు టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారని చెప్పారు. నాలుగున్న దశాబ్ధాలు పాలించిన కమ్యూనిస్టులను వెస్ట్ బెంగాల్ లో జీరో చేసిన చరిత్ర తమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించడం కేవలం బీజేపీతోనే సాధ్యమని రఘునందన్ రావు అన్నారు.
ఇవి కూడా చదవండి ..
- సిద్దిపేటలో కాల్పులు.. 43 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
- చిరంజీవి, పవన్ కల్యాణ్ కు కొత్త చిక్కులు!
- మార్చి 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్..
- అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ