
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆలిండియా సర్వీస్ రూల్స్ లో సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రచ్చ నడుస్తోంది. బీజేపీయేతర పార్టీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఫెడరల్ స్పూర్తిగా విరుద్ధంగా కేంద్ర సర్కార్ నిర్ణయం ఉందని పలువురు ముఖ్యమంత్రులు ఆరోపించారు. రాష్ట్రాల హక్కులు కాలరేసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆలిండియా సర్వీస్ రూల్స్ లో సవరణలు వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కాని కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
Read More : రఘురామ రాజీనామా ఎప్పుడంటే? (crimemirror.com)
వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాలను నడిపించేందుకు సమర్థులైన ఐఏఎస్ అధికారుల్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం స్వాగతించింది. పాలనను సజావుగా, నిరాటకంగా సాగించేందుకు కేంద్రం చేతిలో శక్తిమంతులు, సమర్థులైన అధికారులు ఉండాల్సిందేనని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారుల్ని కేంద్ర సర్వీసుకు డిప్యూటేషన్ పై పిలిపించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ సర్వీసు నిబంధనల్ని సవరించాలన్న ప్రతిపాదనపై పునరాలోచించాలని ఆయన ప్రధానిని కోరారు.
ఆలిండియా సర్వీస్ రూల్స్‌లో సవరణలను ఓ వైపు స్వాగతిస్తూనే.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సమర్థవంతమైన అధికారులు వస్తారని భావిస్తున్నానని.. కేంద్ర ప్రభుత్వంలో సమర్థవంతమైన అధికారులుంటే రాష్ట్రాలకే మేలే జరుగుతుందని అభిప్రాయంతో ఏకీభవించారు. కానీ ఆలిండియా సర్వీస్ రూల్స్‌లో కొన్ని సవరణలతో ఇబ్బందులు వచ్చే అవకాశముందని ప్రధానికి రాసిన లేఖలో జగన్ ప్రస్తావించారు. సర్వీస్‌లో ఉన్న అధికారులను డిప్యూటేషన్‌పై పంపేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు సీఎం జగన్. అయితే వెంటనే డిప్యూటేషన్‌పై కేంద్రం తీసుకుంటే రాష్ట్రంలో ఆ అధికారి చేపట్టిన ప్రాజెక్టులకు ఇబ్బందులు వస్తాయన్నారు సీఎం జగన్. సమర్థులైన అధికారులకు కీలక ప్రాజెక్టుల బాధ్యతలను అప్పగిస్తుంటామని, అలాంటి అధికారిని ఆకస్మికంగా డిప్యూటేషన్‌పై తీసుకుంటే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సూచించారు. తక్షణ బదిలీలతో అధికారుల కుటుంబం, పిల్లల చదువులపై ప్రభావం పడుతుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
డిప్యూటేషన్‌పై ఆలిండియా సర్వీస్ అధికారులను పంపే విషయంలో ప్రస్తుతం రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతినే కొనసాగించాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఎవరిని పంపాలనే నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కోరారు. రాష్ట్రాలు ఎన్‌వోసీ ఇచ్చిన తర్వాతే అధికారులను తీసుకునే పద్ధతిని కొనసాగించాలని ప్రధానిని జగన్ కోరారు.తాను సూచించిన అంశాల ఆధారంగా ఎన్ఓసీ ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొనసాగించండి అంటూ లేఖలో కోరారు జగన్. కేంద్ర డిప్యూటేషన్ రిజర్వుకు అవసరమైన సంఖ్యలో ఐఏఎస్ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుందని తాను హామీ ఇస్తున్నాను అన్నారు. ఐఏఎస్ అధికారుల డిప్యూటేషన్ నిబంధనల్ని కేంద్రం ఏ ఉద్దేశంతో మార్చాలనుకుందో తాను అర్థం చేసుకున్నాను అని లేఖలో చెప్పారు. కానీ కేంద్రం ఎవరిని కోరితే వారిని తక్షణం పంపాలన్ననిబంధనపై పునరాలోచించాలని కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని వేసే అడుడులోనూ ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు మీకుంటుందని హామీ ఇస్తున్నాను అంటూ లేఖలో రాశారు సీఎం జగన్.
ఇవి కూడా చదవండి ..
- అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ …
- మేడారం జాతరలో నిలువు దోపిడీ! అధికారులకు వాటా?
- బీజేపీకి షాకేనా.. కాంగ్రెస్ గల్లంతేనా? ఐదు రాష్ట్రాలపై లేటెస్ట్ సర్వే..
- కరీంనగర్ లో కారు బీభత్సం.. గుడిసెలో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం