
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రైతు బంధు పథకం విషయంలో సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఎకరానికి ఏడాదికి రెండు విడతల్లో రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 10 వేల పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలో ఏ రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా.. ఆ సమాచారం అందించకపోతే ఆ గ్రామానికి రైతు బంధు తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని హెచ్చరించారు.
డ్రగ్ ఫ్రీ గ్రామాలకు ప్రత్యేక ఫండ్స్ తో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తామని సిఎం అన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామస్తుల మీద కూడా ఉందని సీఎం గుర్తు చేశారు.డ్రగ్ ఫ్రీ గ్రామాలకు ప్రత్యేక ఫండ్స్ తో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తామని సిఎం అన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామస్తుల మీద కూడా ఉందని సీఎం గుర్తు చేశారు.5 సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేయండి ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల గ్రామస్తులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Read More : టీఆర్ఎస్ నేత దారుణ హత్య… తల, మొండెం వేరు చేసిన కిరాతకులు – Crime Mirror
తెలంగాణలో గంజాయి కొకైన్ ఎల్ ఎస్డి వంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే వున్నదని, మొగ్గలోనే తుంచి వేయక పోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్న పబ్బులు, బార్లు సంబంధిత కేంద్రాల్లో డ్రగ్స్ వినియోగం పై దృష్టి సాధించాలని, అలాంటి వాటిని గుర్తించి వెంటనే లైసెన్స్ లు రద్దు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పబ్స్ ను గుర్తించాలని, పబ్స్ యజమానులందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి వారికి ఖచ్చితమైన ఆదేశాలివ్వాలని డీజీపీని సీఎం ఆదేశించారు.
ఇవి కూడా చదవండి ..
- మేడారం జాతరలో నిలువు దోపిడీ! అధికారులకు వాటా?
- సిద్దిపేటలో కాల్పులు.. 43 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
- చిరంజీవి, పవన్ కల్యాణ్ కు కొత్త చిక్కులు!
- అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ
2 Comments