
మందుబాబులకు ఇది సూపర్ గుడ్‌న్యూస్. లిక్కర్ కోసం వాళ్లు ఇకపై ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. కిరాణా పచేరీ కొనుగోలు చేస్తున్నట్టుగా మందు కొనేయవచ్చు. ఈ మేరకు కొత్త మద్యం పాలసీను ప్రవేశపెట్టారు.
మందుబాబుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఉద్దవ్ థాకరే సర్కార్ కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇక నుంచి మహారాష్ట్రలో వైన్ బాటిల్స్..పెద్ద పెద్ద కిరాణా షాపుల్లోనూ, డిపార్ట్‌మెంటల్ షాపుల్లోనూ విక్రయించవచ్చు.
ఇప్పటి వరకూ చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టే కేవలం లిక్కర్ షాపుల్లో మాత్రమే మద్యం క్రయ విక్రయాలు జరుగుతాయి. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వ కొత్త లిక్కర్ పాలసీతో కిరాణా షాపుల్లో కూడా వైన్ బాటిల్స్ లభ్యమవుతాయి. చిన్న, మధ్య తరహా వైనరీస్‌ను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. పండ్ల ఆధారిత వైన్ ఉత్పత్తులకు ప్రేరణ లభించాలనే ఉద్దేశ్యంలో పదేళ్లపాటు జీఎస్టీ రద్దు చేసినట్టు మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. ఫలితంగా రైతులకు లాభం చేకూరుతుందన్నారు.
ఇప్పుడు కొత్త మద్యం పాలసీలో భాగంగా చిన్న, మధ్య స్థాయి వైనరీస్‌కు ప్రోత్సాహం, పొమోషన్ చేసేందుకు వేయి చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రదేశాల్లో స్టాల్ లేదా షోకేజ్ ఏర్పాటు చేసి విక్రయించుకోవచ్చు. అంటే ఇక నుంచి మందుబాబులు నేరుగా కిరాణా సామాను కొన్నట్టే..మందు కొనుగోలు చేయవచ్చు లేదా కిరాణా సామానుతో పాటే మద్యం బాటిల్స్‌కు ఆర్డర్ చేసేయవచ్చు.