
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ప్రియురాలిని ప్రియుడు కిడ్నాప్ చేయడం ఎక్కువగా చూస్తుంటాం. ప్రియురాలిని తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్న ఘటనలు ఎక్కువగా జరగుతుంటాయి. కాని ఇక్కడ మాత్రం సీన్ రివర్సైంది. ప్రియురాలే .. ప్రియుడిని కిడ్నాప్ చేసింది. అతని చేత బలవంతంగా తాళీ కట్టించుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ, మరో వ్యక్తితో వివాహేతర సంబం ధం పెట్టుకుంది. పైగా తనతో వివాహానికి అతడు అంగీకరించలేదనే కోపంతో ఓ సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించింది. భయపెట్టి.. బలవంతంగా దం డలు మార్పించి పెళ్లి చేసుకుంది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట శివారులోని కమలాపురానికి చెందిన ముత్యం శ్రీను నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తూనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు రోజువారీ వసూలు కింద కొంత అప్పుగా ఇచ్చాడు. వసూలు కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.ఇది తెలిసి ఆ మహిళ భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అయితే.. శ్రీను వల్లే తన కాపురం దెబ్బతిన్నదంటూ ప్రియుడిని ఆమె నిలదీసింది. 2 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. నష్టపరిహారంగా గతంలో ఇచ్చిన అప్పును మాఫీ చేసి మహిళకు శ్రీను అదనంగా రూ.1.5 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేశారు. అనంతరం ఆ వివాహిత ప్రియుడు శ్రీనునే పెళ్లి చేసుకొని, కొంత ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ వేసింది. శ్రీను కిడ్నాప్ కు ఓ సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
బుధవారం పట్టణ శివారులో గ్యాంగ్ సభ్యులతో కలిసి శ్రీనును బలవంతంగా కారులో ఎక్కించుకొని పాకాల వైపు వెళ్లింది. స్థానికులు శ్రీను కుటుంబ సభ్యులకు తెలపడంతో బాధితుడి కుమారుడు భరత్ పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. తమను పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించిన సుపారీ గ్యాంగ్ శ్రీనును, మహిళ ను గంజేడు అడవిలోకి తీసుకెళ్లి దండలు మార్పించి ఫొటోలు తీశారు. కొంత ఆస్తిని రాసివ్వాలన్నారు. పెద్ద మనుషుల వద్ద మాట్లాడుకుందామని అతడు చెప్పడంతో నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా మహిళ ఇంట్లో అతడిని వదిలేసి పరారయ్యారు. శ్రీనును పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఏపీలో కనుమరుగువుతున్న కడప జిల్లా! జగనన్నపై జనాల గుస్సా..
- కొండా సినిమాలో ఏముంది?ఎర్రబెల్లిని వర్మ టార్గెట్ చేశారా?
- రింగో… ‘రింగ్’….! షాద్ నగర్ లో మద్యం వ్యాపారుల సిండికేట్
- అక్రమ కట్టడాల కూల్చివేతపై జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేత
3 Comments