
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల చేతులెత్తేశారా? పార్టీని నడపడం సాధ్యం కాదని డిసైడ్ అయ్యారా? అంటే కొన్ని రోజులగా షర్మిల పార్టీ కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. పార్టీ కమిటీలన్నింటిని షర్మిల రద్దు చేయడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మి పార్టీ స్థాపించిన వేళ విశేషం ఏమిటో కానీ.. ఆమెకు ఏదీ కలిసి రావడం లేదు. ఆమెకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నట్లు తెలుస్తోందీ. ఇటీవల కోవిడ్ మహ్మమారి విజృంభించిందీ. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్‌లోని ఆమె కార్యాలయ సిబ్బందిలో పలువురికీ కరోనా పాజిటీవ్ వచ్చినట్లు సమాచారం. దాంతో లోటస్ పాండ్‌కు తాళం వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కార్యాలయానికి ఎవరు రావద్దంటూ సిబ్బందితోపాటు లీడర్ నుంచి క్యాడర్ వరకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయట. దీంతో వారం రోజుల పాటు లోటస్ పాండ్‌లోని వైయస్ షర్మిల కార్యాలయానికి తాళం వేశారని సమాచారం. దీంతో ఎలాంటి యాక్టివిటీ లేక పోవడంతో సదరు కార్యాలయం వెలవెల బోతోంది. గతంలోనూ సెకండ్ వేవ్ కారణంగా.. కార్యాలయ సిబ్బంది కోవిడ్ బారిన పడి.. ఆసుపత్రిలో చేరిన సంఘటనలు చాలానే ఉన్నాయని… ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని పార్టీలోని కీలక నేతలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీని స్థాపించిన వైయస్ షర్మిల.. కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు, రైతుల కుటుంబాలను సైతం వైయస్ షర్మిల పరామర్శించారు. ఆ క్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 400 రోజుల పాటు, 4 వేల కిలోమీటర్ల మేర ప్రజా ప్రస్థాన యాత్ర పేరిట వైయస్ షర్మిల పాదయాత్రను చేపట్టారు. కానీ ఆమె పాదయాత్ర చేపట్టిన 21 రోజులకే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిందీ.. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కరోనా విజృంభించడంతో వైయస్ షర్మిల పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. అంతేకాదు గతంలో వైయస్ షర్మిల పార్టీతో చేసుకున్న ఒఫ్పందాన్ని ప్రశాంత్ కిషోర్ రద్దు చేసుకుంటున్నారని తెలుస్తోందీ. అలాగే తెలంగాణలో పార్టీ పెట్టి నడపడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని.. పాదయాత్ర ఆపి.. పార్టీ మూసేయాలంటూ ఈ సందర్భంగా వైయస్ షర్మిలకు ప్రశాంత్ కిషోర్ సూచించారని… కానీ వైయస్ షర్మిల మాత్రం ఇవేమీ పట్టనుట్లు.. తెలంగాణలో పార్టీని ఉరికించాలని భావిస్తుందన తెలుస్తోందీ.
అయితే వైయస్ షర్మిలకు ప్రస్తుతం కాలం కూడా కలిసి రావడం లేదని.. రాజకీయం అంటే.. అన్నీ కలిసి రావాలి.. అందరిని కలుపుకుపోవాలి… అలా అయితేనే రాజకీయంగా ఎదుగుతాం.. ఎన్నికల్లో గెలుస్తాం. అంతేకానీ.. ఎవరు లేకుండా… ఒక్కరే వెళ్లితే.. ఒక్కరుగానే మిగిలిపోయే పరిస్థితి లేక పోలేదనే కామెంట్స్ సైతం.. షర్మిల పార్టీలో వినిపిస్తున్నాయి. మరి వైయస్ షర్మిల ఎం చేస్తుందో వేచి చూడాలని.. ఆమె పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- అక్రమ కట్టడాల కూల్చివేతపై జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేత
- ల* కొడకా… జర్నలిస్ట్ ను బండ బూతులు తిట్టిన అమెరికా అధ్యక్షుడు
- ‘భీమ్లా నాయక్’తో మారిన పద్మశ్రీ మొగులయ్య జీవితం..
- ఏపీలో కొత్త జిల్లాలు- రాజధానులు ఇవే! – Crime Mirror
One Comment