
క్రైమ్ మిర్రర్, కొడంగల్ ప్రతినిధి: నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపిలు, పిఎంపిలకు, జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ, డాక్టర్ రవీందర్ యాదవ్, కొడంగల్ సీఐ అప్పయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా తమ ప్రథమ చికిత్స కేంద్రాలను నిర్వహించడానికి క్రింది మార్గదర్శకాలను అనుసరించాలని ఆదేశాలు, మార్గదర్శకాలు పాటించని వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్టిఫికేట్ అర్హత కోసం గుర్తింపు పొందిన సంస్థ నుండి “ఫస్ట్ ఎయిడ్” శిక్షణకు వెళ్లి ఉండాలని, మరియు “ఫస్ట్ ఎయిడ్ సెంటర్”లో ప్రదర్శించబడాలన్నారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలు” ఒకే గదిలో, “12X12” పరిమాణంలో పనిచేయాలని సైన్ బోర్డులపై పేర్ల ముందు “డాక్టర్” లేదా డాక్టర్ అని వ్రాయకూడదని సైన్ బోర్డులపై “క్లినిక్” అనే పదాన్ని వ్రాయవద్దని”ఫస్ట్ ఎయిడ్ సెంటర్” అని బోర్డులపై మాత్రమే అని రాయాలని సూచించారు.
ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్”లో ఎలాంటి ఇంజెక్షన్లు వాడకూడదన్నారు.బెడ్‌లు, మంచాలు,ఐవి స్టాండ్‌లు లేదా పేషెంట్ ఫెసిలిటీ కింద వచ్చే ఏ ఇతర స్థాపనలు ఉండకూడదని రోగులకు ప్రిస్క్రిప్షన్లు, రాయకూడదని ప్రథమ చికిత్స కేంద్రంలోని ప్రైమసీలలో ల్యాబ్, ఎక్స్-రే లేదా ఫార్మసీ పని చేయకూడదని ఎంటీపిలు, సాధారణ ప్రసవాలు మరియు ఇతర శస్త్ర చికిత్సలు చేయరాదన్నారు. ఐవి ద్రవాలు మొదలైన వాటిని ఉపయోగించకూడదని మధుమేహం, హైపర్‌టెన్షన్ మరియు స్టెరాయిడ్స్ రోగులకు ఉపయోగించారాదని సూచించారు. ఈకార్యక్రమంలో డాక్టర్లు ఆర్ఎంపి లు పిఎంపిలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న బడంగ్పేట్ కార్పోరేషన్
- కొండా దంపతులనే తరిమికొట్టా.. విగ్రహం ఓ లెక్క: చల్లా ధర్మారెడ్డి
- యాదాద్రి క్షేత్రానికి తగ్గిన భక్తుల రద్దీ….
- మినిస్టిర్ సార్ .. నా ఆత్మహత్యకు అనుమతినివ్వండి ..
One Comment