
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయినా అప్పుడే రాష్ట్రంలో రాజకీయ వేడి కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ సహా విపక్షాలు పోటాపోటీగా జనంలోకి వెలుతున్నాయి. అంతేకాదు ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటన్న దానిపై ఎప్పటికప్పుడు పార్టీలు సర్వేలు కూడా చేసుకుంటున్నాయి. సర్వే ఫలితాల ఆధారంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ సర్వేలో వచ్చిన ఫలితం ఆ పార్టీలో జోష్ నింపిందని తెలుస్తోంది. ఈ సర్వే ను చూసిన కాంగ్రెస్ నేతలు.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెబుతున్నారట.
తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అదనంగా 12 సీట్లు గెలిస్తే చాలని తేలిందని అంటున్నారు.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 48 సీట్లు ఖాయమని సర్వేలో తేలిందట. ఆ సర్వే ప్రకారం దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఊపు మీద ఉందని అంటున్నారు. ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్లో ఆ పార్టీకి మంచి నాయకులు ఉన్నారు. మెదర్ లో కూడా పార్టీకి బలం ఉందని చెబుతున్నారు. రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారని సర్వే పేర్కొందని సమాచారం.
ఉత్తర తెలంగాణలోటీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉందని సర్వేలో తేలిందట. అక్కడ మంచి నాయకులు ప్రజల్లోకి వెళ్తే పార్టీకి తప్పకుండా ఆదరణ దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. అక్కడ కూడా పార్టీ పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.మొత్తంగా ఆ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ 48 చోట్ల గెలుస్తుందని అంటున్నారు. ఇక అధికారంలోకి రావాలంటే మరో 12 సీట్లు మాత్రమే కావాలని పార్టీ కష్టపడితే అదేం కష్టం కాదని చెబుతున్నారు. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఓ పార్టీకి 60 సీట్లు కావాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో 12 సీట్లు తెచ్చుకుంటే చాలాని సర్వే చెబుతోంది.
కేసీఆర్ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్నందున ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఈజీగానే మేజిక్ ఫిగర్ మార్క్ చేరుకుంటుందన్నది కాంగ్రెస్ నేతల విశ్లేషణ. ఒకవేళ అలా జరగకోయినా… సర్వే ప్రకారం 48 సీట్లే వచ్చినా తమ సర్కారే ఏర్పడుతుందని ధీమాగా చెబుతున్నారు. ఎలాగూ ఎంఐఎం పార్టీకి 7 నుంచి 9 సీట్లు వస్తాయి. బీఎస్పీ సహా కొందరు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉంటుంది. వాళ్ల మద్దతు సంపాదించడం కాంగ్రెస్ కు ఈజీపనే అని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి ..
- వెయ్యి కోట్ల ఆస్తిపరుడు.. డ్రగ్స్‌కు బానిసై జైలుకు..
- భర్తను నరికి.. తలతో పీఎస్‌కు మహిళ.. చిత్తూరు జిల్లాలో కిరాతకం
- శబరిమలలో పేలుడు పదార్ధాలు కలకలం ..
- రియల్ భూ బకాసురుల నుండి పార్క్ లను కాపాడండి
5 Comments