
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్. ఇనుప కంచెలు, ఎత్తైన గేట్లు, పోలీసుల పహారాతో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలన్నా.. ప్రగతిభవన్ గేట్ దాటాలన్నా.. అంత ఈజీ మాత్రం కాదు. మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, సొంత పార్టీ నేతలకే పర్మిషన్ ఉండదు. అందుకేగా, ఈటల రాజేందర్ ఆ బానిస భవన్‌ను బద్దలు కొడతానంటూ పార్టీని వీడారు. అలాంటిది.. ఏపీకి చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే లోనికి రానిస్తారా? ప్రగతిభవన్ గేటును కూడా తాకనీయకుండా.. అట్నుంచి అటే తిప్పిపంపించేశారు. జేసీ లాంటి సీనియర్, ఫైర్‌బ్రాండ్ లీడర్‌కు ఇది ఘోర అవమానమే.
అప్పుడప్పుడు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో హల్‌చల్ చేసే జేసీ దివాకర్‌రెడ్డి.. ఎప్పుడుపడితే అప్పుడు ప్రగతిభవన్‌లోకి కూడా వెళ్లొచ్చని అనుకున్నారో ఏమో.. లేటెస్ట్‌గా ఆయన అలా ట్రై చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్ దగ్గరకు వచ్చారు. అక్కడి పోలీసులు జేసీని అడ్డుకున్నారు. అపాయింట్‌మెంట్ ఉందా? అని అడిగితే.. లేదు.. జేసీ వచ్చాడని చెప్పుపో.. అంటూ దివాకర్‌రెడ్డి దర్పం ప్రదర్శించారు. అయితే, ఆయన లెవల్ అక్కడ ఏమాత్రం వర్కవుట్ అవలేదు.
ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్‌లోకి ఎవరినీ అనుమతించేది.. అది జేసీ అయినా.. గీసీ అయినా.. జాన్తానై అంటూ పోలీసులు దివాకర్‌రెడ్డిని అడ్డుకున్నారు. చేసేది లేక పెద్దాయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి ..
- కొవిడ్ కావాలా.. అయితే మా ఇంటికి రండి! వైసీపీ ఎమ్మెల్యే ఆఫర్..
- లక్ష్మిపార్వతి.. ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడిందట!
- వీడిన మొండెం లేని తల మిస్టరీ
- రైతులకు పింఛన్! కేసీఆర్ మరో సంచలనం..
3 Comments