
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు ఎక్కువగా వైరస్ భారీన పడుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘స్వల్ప లక్షణాలతో నేను కోవిడ్ బారిన పడ్డాను. గత కొద్ది రోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారు.. తప్పనిసరిగా కావల్సిన జాగ్రత్తలు తీసుకోండి’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Read More : బీజేపీ ఆఫీసు గేట్లు బద్దలు కొట్టి బండి సంజయ్ అరెస్ట్ – Crime Mirror
ఇటీవలి కాలంలో రచ్చబండ కార్యక్రమంతో పాటు బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడం వంటివి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే హౌస్ అరెస్ట్‌లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రేవంత్ ఇంటికి రావడం, ఆయనను కలవడం వంటివి జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ వేగంగా విస్తరిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి ..
- నేరుగా టీఆర్ఎస్ లోకి వెళ్లగలడట! జగ్గారెడ్డి జంపింగ్ ఖాయమేనా?
- చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించిన తహశీల్దార్
- రేవంత్ పై హైకమాండ్ కు కంప్లైంట్.. అంతా కేసీఆర్ ఆపరేషన్?
- ధరణీ లోపాలే అవినీతి అధికారులకు ఆదాయ మార్గాలు..!