
- పహని రికార్డులు కావాలంటే పది వేలు ఇవ్వాల్సిందే…
- సంస్థాన్ మండల ఆఫీస్ లో అధికారుల పైసల దందా
- అవినీతి అధికారులకు తహశీల్దార్ అండ
క్రైమ్ మిర్రర్, యదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లోపాలే, సంస్థాన్ నారాయణపురం మండలం తహసిల్దార్ కార్యాలయ అవినీతి అధికారులకు , ఆదాయ మార్గాలయ్యాయి.. ఈ అవినీతి అక్రమాలన్నీ, మండల తహసీల్దార్ కు తెలిసే జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ మండల కార్యాలయ అధికారులు వేలాది రూపాయల అవినీతి సొమ్ము జేబుల్లో పడనిదే ఇంటి దారి పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. వివరాల్లోకి వెళితే…
గతంలో భూ విక్రయాలు జరిగి, పట్టాదారు పేరిట మ్యుటేషన్ కానీ భూములను లక్ష్యంగా చేసుకొని సమస్త నారాయణపురం మండలం తాసిల్దార్ కార్యాలయం పరిధిలో పనిచేసే అవినీతి వీఆర్ఏలు పావులు కదిపినట్లు తెలుస్తోంది. భూ విక్రయాలు జరిగినా, పట్టాదారు మ్యుటేషన్ చేసుకొని, భూ యజమానలను తమ వద్దకు పిలిపించుకొని … మీ భూములను తిరిగి మీ పేరిట నే రిజిస్ట్రేషన్ అయ్యేలా చూస్తామని చెప్పి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో లంచాలను దండు కొన్నట్లు సమాచారం. భూములు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్పటికీ , ఆ భూములను మ్యూటేషన్ చేసుకోకపోతే ధరణి పోర్టల్ లో తొలుత భూ యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేర్లనే చూపిస్తున్నాయి. దీనితో గతంలో భూ విక్రయాలు జరిపిన వారి పేరిటనే తిరిగి భూములను పట్టాలు చేయడం అవినీతి రెవెన్యూ అధికారులకు సులభం గా మారింది. ఎందుకంటే… ధరణి పోర్టల్ లోని సాంకేతిక లోపాలు వారికి వరంగా మారాయి. ఇప్పుడు అవే సాంకేతిక లోపాలను తమకు అనుకూలంగా మలచుకుని, సంస్థాన్ నారాయణపురం మండల రెవెన్యూ అధికారులు రెండు చేతుల సంపాదించు కుంటు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read More : మేకలను దొంగతనం చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా? – Crime Mirror
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని సర్వేల్, మల్లారెడ్డి గూడ గ్రామాల పరిధిలోని పలువురు రైతులు గతం లో తమ భూములను విక్రయించగా, వాటిని కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్పటికీ తమ పేరిట ఆ భూములను మ్యుటేషన్ చేయించుకోలేదు. స్థానిక విఆర్ఎ , ఉన్నతాధికారుల అండదండలతో ఆ భూములను తిరిగి రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో, ఆ భూములు కొనుగోలు చేసి మ్యుటేషన్ చేయించుకొని పట్టాదారులు లబోదిబోమంటున్నారు. భూముల విలువలు ఆకాశాన్నంటు తుండడం వల్లే, గతంలో భూములు విక్రయించిన రైతులు సైతం ధరణి లోపాలను ఆసరాగా చేసుకొని ఏదో ఒక సాకుతో తిరిగి కొనుగోలుదారుల వద్ద నుంచి డబ్బులు రాబట్టుకుని ఎత్తుగడలు వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికి అవినీతి రెవెన్యూ అధికారుల అండదండలే కారణమని పలువురు మండిపడుతున్నారు.
ఫహని రికార్డులు కావాలంటే…
సంస్థాన్ నారాయణపురం మండల తాసిల్దార్ కార్యాలయం నుంచి పహాని రికార్డు కావాలంటే… కార్యాలయ సిబ్బంది అడిగిన మొత్తం ఇస్తే తప్పితే ఇవ్వడం లేదనీ పలువురు మండిపడుతున్నారు. పహని రికార్డులు కావాలంటే పది వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసిల్దార్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఎల్బీనగర్ లో గ్యాంగ్ వార్ .. నర్సింహా రెడ్డి మృతి
- ఆస్తి పంపకం కోసం అన్న తమ్ముళ్ల పై దాడి…!!
- అయ్యో భగవంతుడా ఎంత పని చేసావు…..!!
- 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఫ్రీ! త్వరలో ఆర్టీసీ బంపర్ ఆఫర్..
2 Comments