
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : దేశంలో ఒమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6 వందలు దాటింది. న్యూ ఇయర్ వేడుకలతో వైరస్ మరింతగా విస్తరిస్తుందనే ఆందోళన నెలకొంది. అందులో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కొన్ని రాష్ట్రాలు వారం రోజులు ఆంక్షలు పెడితే.. ఇంకొన్ని రాష్ట్రాలు మూడు, నాలుగు రోజులు ఆంక్షలు విధించాయి. పలు రాష్ట్రాలు కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. కాని ఒమిక్రాన్ కేసులు భయపెడుతున్న తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
Read More : బీజేపీని గెలిపిస్తే రూ.50కే చీప్ లిక్కర్! – Crime Mirror
దేశంలో ఒమిక్రాన్ కేసుల్లో తెలంగాణ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 63కు పెరిగింది. అయినా ఎలాంటి ఆంక్షలు విధంచడం లేదు కేసీఆర్ సర్కార్. విధంచకపోగా అన్ని బార్లా తేరిచేలా నిర్ణయాలు తీసుకుంటోంది. మందుబాబులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల వేళలు పొడిగించింది. డిసెంబరు 31న.. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చేసింది. అర్థరాత్రి అందరికీ హ్యాపీ న్యూఇయర్ చెప్పేవరకూ.. ఫుల్‌గా తాగొచ్చు. తాగినోళ్లకి తాగినంత మందు అందుబాటులో ఉంచడమే కేసీఆర్ సర్కారు లక్ష్యం.
31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు న్యూఇయర్ ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఎక్సైజ్‌శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేయనుంది. అయితే, ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి లైసెన్స్‌ఫీజు రూ.50వేల నుంచి 2.5లక్షలుగా ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. అంటే, డిసెంబర్ 31 నైట్ ఇటు గ్లాసుల గలగల.. అటు సర్కారు ఖజానాకు కాసుల గలగల.
ఇవి కూడా చదవండి ..
- 31న మిడ్ నైట్ వరకు వైన్స్ ఓపెన్.. ఒమిక్రాన్ పెరుగుతున్నా పట్టని సర్కార్
- కేసిఆర్, సబితమ్మకు నైతిక విలువలు లేవు.. బీజేపీ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహా
- పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పనికిరాడు! సోనియా, రాహుల్ కు జగ్గారెడ్డి లేఖ..
- కేసీఆర్ ఫాంహౌజ్ దగ్గర రచ్చబండ.. రేవంత్ రెడ్డి అరెస్టుతో ఉద్రిక్తత
One Comment