
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మందు బాబులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బీజేపీకి అధికారం ఇస్తే 70 రూపాయలకే చీప్ లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ లో నిర్వహించిన బీజేపీ జనాగ్రహ సభలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే పచ్చిసారా కాస్తూ.. రూ.3రూపాయల మద్యాన్ని రూ.25 రూపాయలకు కొని రూ.250కి విక్రయిస్తున్నారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రూ.70 చీప్ లిక్కర్ ఇస్తాం… ఆదాయం బాగుంటే రూ.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. మద్యం రూపంలో ప్రజలను దోచి మళ్లీ వారికే ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోరికను తీర్చే సత్తా బీజేపీకే ఉందని సోము వీర్రాజు ధీమావ్యక్తం చేశారు.
Conress : కాంగ్రెస్ లో రచ్చబండ రచ్చ.. రేవంత్ పై కేసీఆర్ కోవర్టుల కుట్ర ! – Crime Mirror
బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్లలో రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. రాజధానిలో రైతుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా బీజేపీ నమ్మిందని.. అందుకే ఇక్కడే తాము రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించామని..ఎయిమ్స్ ను కూడా మంగళగిరిలో నిర్మించామన్నారు. అలాగే రాజధాని కోసం వేలకోట్లు ఇచ్చామన్నారు. ఇక ఉత్తరాంద్ర, రాయలసీమను అభివృద్ధి చేసే పార్టీ బీజేపీ అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు.సంక్షేమం అమలులో వైసీపీ కంటే బీజేపీనే ముందుందని వీర్రాజు అన్నారు. జగన్ దగ్గర నవరత్నాలుంటే.. మోదీ దగ్గర 90 రత్నాలున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి ..
- 31న మిడ్ నైట్ వరకు వైన్స్ ఓపెన్.. ఒమిక్రాన్ పెరుగుతున్నా పట్టని సర్కార్
- కేసిఆర్, సబితమ్మకు నైతిక విలువలు లేవు.. బీజేపీ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహా
- విలువలకు నీళ్ళు వదిలిన మంత్రి సబిత
- పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పనికిరాడు! సోనియా, రాహుల్ కు జగ్గారెడ్డి లేఖ..
2 Comments