
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల్లోకి వలసలు మళ్లీ జోరందుకున్నాయి. గతంలో అధికార పార్టీలోకి వలసలు ఉండగా.. ఇప్పుుడు మాత్రం విపక్ష పార్టీల్లో జోరుగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో సీనియర్ నేత పార్టీ మారుతున్నారు. రాజ్యసభ సభ్యుడ డి శ్రీనివాస్ త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే సోనియాగాంధీలో ఆయన చర్చించారు. దాదాపు 40 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలో డీఎస్ చేరిక దాదాపు ఖరారైంది. దీనిపై ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. అధిష్ఠానం పిలుపుమేరకు భట్టి కూడా ఢిల్లీ వెళుతున్నారు.
TRS Minister : హవ్వ… ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులా? – Crime Mirror
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి.శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 1989 నుంచి 2015 జులై వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘంగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవులు అనుభవించారు. వైఎస్ క్యాబినెట్లో మంత్రిగానూ వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో డీఎస్ ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అవకాశం ఇచ్చింది.
జనవరిలో ఒమిక్రాన్ విలయం! బ్రిటన్ లో హాస్పిటల్స్ హౌజ్ ఫుల్.. – Crime Mirror
ఇటీవల కాలంలో డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పీసీసీ చీఫ్ గా నియామకం అయిన కొన్ని రోజులపై రేవంత్ రెడ్డి డీఎస్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అప్పుడే డీఎస్ తిరిగి సొంత గూటికి వస్తారనే ప్రచారం జరిగింది. అయితే డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉండటంతో ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నది ఆసక్తి రేపింది. తాజాగా ఆయన ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీతో సమావేశం కావడంతో కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది.
ఇవి కూడా చదవండి ..
- సబితమ్మ… ఇది ఏందమ్మా? .. భౌతిక దాడులను ప్రోత్సహించడం కరెక్టేనా
- మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- బీజేపీ మహిళా మోర్చా సెక్రటరీగా పులిగోళ్ల శ్రీలక్ష్మి యాదవ్
- కేసీఆర్ కు స్టాలిన్ షాకిచ్చారా? కూటమి కుదరదని చెప్పేశారా?