

- నెట్ లో జనాలు ఆమె గురించి ఏం వెతికారంటే..?
- ఆమె ఎత్తు, వయసు గురించి ఎక్కువగా శోధించిన నెటిజెన్లు
- మిస్ యూనివర్స్ గా ఎంపికైన మూడో భారతీయురాలు
- ఈ టైటిల్ దేశానికి అంకితం: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు
- 21 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారతీయ మోడల్..
నెట్ లో జనాలు ఆమె గురించి ఏం వెతికారంటే..?
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆమె పేరే! ఆమే భారత యువతి హర్నాజ్ సంధు. నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయం లేని ఈపేరు.. ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇజ్రాయెల్ లో జరిగిన ఈ అందాల పోటీలో పంజాబ్ కు చెందిన హర్నాజ్ విశ్వసుందరిగా అవతరించింది. 21 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటం భారత్ సొంతమైంది. ఈ కిరీటాన్ని దక్కించుకున్న 3వ భారతీయ మహిళగా హర్నాజ్ నిలిచింది. మరోవైపు మిస్ యూనివర్స్ గా హర్నాజ్ గెలుపొందిందనే వార్తలు రాగానే ఇంటర్నెట్ హీటెక్కింది. హర్నాజ్ గురించి నెటిజెన్లు విపరీతంగా సర్చ్ చేశారు. ఆమె గురించి వివరాలు తెలుసుకునేందుకు భారతీయులు ఉత్సాహం చూపారు. హర్నాజ్ కౌర్ సంధూ మిస్ యూనివర్స్, మిస్ యూనివర్స్ 2021, మిస్ యూనివర్స్ వంటి పదాలు గూగుల్ సర్చ్ లో టాప్ లో నిలిచాయి. దీంతో పాటు హర్నాజ్ వయసు, ఎత్తు గురించి కూడా ఎక్కువగా సర్చింగ్ జరిగింది.
Etela Vs Bandi : ఈటలకు బండి సంజయ్ ఝలక్.. కరీంనగర్ లో బీజేపీ ఓట్లు క్రాస్! – Crime Mirror
‘మిస్ యూనివర్స్ కిరీటం’ ధర ఎంతో తెలుసా?
అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేసేవాళ్లందరికీ ‘మిస్ యూనివర్స్ కిరీటం’ గెలవాలనే కోరిక ఉంటుంది. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని చిరునవ్వులు చిందించాలని కలలు కంటారు. అయితే, అందంతో పాటు తెలివితేటలతో జడ్జిలను మెప్పించిన వాళ్లకే మిస్ యూనివర్స్ కిరీటం దక్కుతుంది. అందగత్తెలు మనసు పారేసుకునేంత విషయం ఈ కిరీటంలో ఏముంది అనిపిస్తోందా! ఈ కిరీటం డిజైన్, ధర మాత్రమే కాదు… దాని తయారీ వెనకున్న థీమ్ కూడా చాలా స్పెషల్. ఈ ఏడాది ‘మిస్ యూనివర్స్’గా నిలిచిన హర్నాజ్ సంధు తల మీద అలంకరించిన కిరీటం అందాల పోటీల్లో విజేతలకి ఇచ్చే కిరీటాల్లో కెల్లా ఖరీదైంది. ‘మిస్ యూనివర్స్ మౌవాద్ పవర్ ఆఫ్ యూనిటీ క్రౌన్’గా పిలిచే ఈ కిరీటం ధర 37 కోట్ల రూపాయలు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
పంజాబ్ రాజధాని చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు వృత్తిపరంగా ఒక మోడల్. చండీగఢ్‌లోనే డిగ్రీ పూర్తి చేసిన హర్నాజ్ ప్రస్తుతం మాస్టర్స్ కూడా చదువుకుంటోంది. ఒకవైపు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొంటూ.. మరోవైపు చదువుని కొనసాగిస్తోంది ఈ 21 ఏళ్ల అమ్మడు. అంతేకాదు రెండు పంజాబీ సినిమాలలో కూడా నటించింది. 17 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్ ప్రారంభించిన హర్నాజ్ ఇప్పటివరకు నాలుగు బ్యూటీ కాంటెస్ట్‌లలో విన్నర్‌గా నిలిచింది. 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్, 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, 2021 లో మిస్ యూనివర్స్ ఇండియా కితాబులను అందుకుంది. ఈ పోటీల్లో 79 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో గెలిచిన హర్నాజ్ సంధు ఎవరు అని తెలుసుకోవడానికి భారతీయులంతా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ టైటిల్ దేశానికి అంకితం: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు
21 ఏళ్ల అనంతరం భారత దేశానికి విశ్వసుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టింది ఈ 21 ఏళ్ల పంజాబీ ముద్దుగుమ్మ. ఇజ్రాయెల్‌లో నిర్వహించిన విశ్వసుందరి పోటీల కోసం నవంబర్ 27న భారత్ నుంచి ఇజ్రాయెల్‌కి పయనమైంది. చివరికి టైటిల్ సొంతం చేసుకుని.. తన మనుసులో భావాలను ఇన్‌స్టాలో పంచుకుంది. నేను థాంక్స్ చెప్పాల్సింది మా కుటుంబ సభ్యులకు. ఎందుకంటే వాళ్లంతా ఇప్పుడూ ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. మీ ముందుకు నన్ను ఇంత అందమైన మహిళగా తీర్చిదిద్దిన మా ప్యానలిస్టులతో పాటు డిజైనర్లకు నా ధన్యవాదాలు తెలిపింది. మీరెవరూ లేకుండా నా కల నిజమయ్యేది కాదు. చివరిగా.. నా ప్రియమైన దేశం.. ఇండియాకు మిస్ యూనివర్స్ టైటిల్ అంకితం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసిన లేఖను విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి ..
- ఓమిక్రాన్ ఎఫెక్ట్..కీలక ఆదేశాలు జారీచేసిన హరీష్ రావు
- మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- మితిమీరుతున్న మంత్రి అనుచరుల అరాచకాలు
- యాదాద్రి కలెక్టరేట్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం!
One Comment