
- ఈ వేరియంట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..?
- ఒక్కరోజే మూడు రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసు నమోదు
- కాలిఫోర్నియాలో మాస్క్ తప్పనిసరి
- ఒమిక్రాన్ భయాలతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- ఒమిక్రాన్ కేసుల సంఖ్యపై పొంతన లేకుండా మాట్లాడిన బ్రిటన్ ఉప ప్రధాని
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కరోనావైరస్ కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ తెరపైకి వచ్చిన తర్వాత, అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ వేరియంట్ ఎక్కడ నుండి వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. రెండేళ్ల క్రితం చైనాలో మొదలౌ మహమ్మారి ప్రపంచం మొత్తం చుట్టేసి కోట్లాది మందిని మంచానికి కట్టేసింది. తాజాగా కొత్త వేరియంట్ మరోసారి కలవరాన్ని సృష్టిస్తోంది. అయినప్పటికీ, ఈ రూపాంతరం పరివర్తనం చెంది వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని కారణంగా ఇది ఆల్ఫా, బీటా, డెల్టా నుండి వచ్చినట్లు కనిపించదు. ఇది 18 నెలల క్రితం వ్యాప్తి చెందిన కరోనావైరస్ నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అప్పుడు ప్రశ్న తలెత్తుతుంది. ఇది ఇప్పటివరకు ఎక్కడ ఉంది? మరి ఇప్పుడు ఇది ఎందుకు విధ్వంసం సృష్టిస్తోంది? ఒమిక్రాన్ వేరియంట్ కనిపించడానికి పరిశోధకులు ఇప్పుడు అనేక కారణాలను కనుగొంటున్నారు.
Miss Universe: మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా? – Crime Mirror
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు : ఒమిక్రాన్ కేసులు భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో టెస్టుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారికి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నప్పటికీ PCR టెస్టుల్లో వీటిని గుర్తించడం కష్టంగా మారింది. ఒమిక్రాన్ నిర్ధారించేందుకు పాజిటివ్ వచ్చిన నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ అంతా మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కేవలం రెండు గంటల్లోనే ఒమిక్రాన్‌ను గుర్తించే టెస్ట్ కిట్‌ను ICMR అభివృద్ధి చేసింది. ల్యాబ్‌లలోనే అందుబాటులో ఉండే ఈ కిట్‌ల ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను అతితక్కువ సమయంలోనే గుర్తించవచ్చని ICMR శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఒక్కరోజే మూడు రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసు నమోదు.. : ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్..భారత్‌లోనూ తన ప్రతాపం చూపిస్తోంది. దేశంలో అంతకంతకూ పెరుగుతూ వేరియంట్ కేసులు 37కు చేరాయి.తాజాగా ఛండీగఢ్, ఏపీ, నాగ్‌పూర్‌లో తొలి కేసు వెలుగులోకి రాగా..కర్ణాటకలో మూడో కేసు బయటపడింది. రాష్ట్రాలకు క్రమంగా విస్తరిస్తుండటంతో.. అలర్ట్ అయిన కేంద్రం ఎయిర్‌పోర్టులలో విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచి స్క్రీనింగ్ టెస్టులు ముమ్మరం చేసింది.
ఒమిక్రాన్ భయాలతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు : అంతర్జాతీయంగా, దేశీయంగా పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒమిక్రాన్ భయాలతో ఈరోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు నష్టపోయి 58,117కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 17,324 వద్ద స్థిరపడింది.
కాలిఫోర్నియాలో మాస్క్ తప్పనిసరి : ఒమిక్రాన్ కలవరానికి తోడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అమెరికాలోని కాలిఫోర్నియా అప్రమత్తమైంది. రెండు వారాల వ్యవధిలోనే అక్కడ కొవిడ్ కేసుల సంఖ్య 47శాతం పెరిగింది. దీనికి తోడు ఈ సెలవుల్లో ప్రజలు తమ స్నేహితులు, కుటుంబాలను కలుసుకునే అవకాశం ఉండడంతో అక్కడి ప్రభుత్వం మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధన నేటి నుంచి వచ్చే నెల 15వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత సమయంలో కరోనాను అదుపు చేసేందుకు తమ వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం మాస్కేనని, అదొక్కటే బాగా పనిచేస్తోందని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ డాక్టర్ మార్క్ ఘాలే అన్నారు.
ఒమిక్రాన్ కేసుల సంఖ్యపై పొంతన లేకుండా మాట్లాడిన బ్రిటన్ ఉప ప్రధాని : కరోనా డెల్టా వేరియంట్ తో తీవ్ర కుదుపులకు గురైన బ్రిటన్ లో ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ప్రభుత్వానికి సమస్యాత్మకంగా మారింది. కాగా, బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ నిన్న మాట్లాడుతూ, దేశంలో 10 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి ..
- ఓమిక్రాన్ ఎఫెక్ట్..కీలక ఆదేశాలు జారీచేసిన హరీష్ రావు
- మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- మితిమీరుతున్న మంత్రి అనుచరుల అరాచకాలు
- మంత్రి సమక్షంలో బిజెపి టిఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహి