
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : నల్గొండ జిల్లా మునుగోడు టీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీలో అంతా లీడర్లే అయ్యారు. పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి పోటీగా మరో ఏడుగురు నేతలు ఎమ్మెల్యే రేసులో ఉన్నామనే సిగ్నల్స్ ఇస్తున్నారు. నేతల పోటాపోటీ ఎత్తులు, వర్గాలతో మునుగోడు గులాబీ పార్టీలో సప్తపది సాగుతుందనే చర్చ జరుగుతోంది. ఎవరికి వారే తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో రోజు రోజుకు మునుగోడు కారు పార్టీ రాజకీయం రంజుగా మారుతోంది.
Read More : సంతకాల రగడ … ఎమ్యెల్సీ నామినేషన్ పత్రాలపై చేసిన సంతకాలపై లొల్లి లొల్లి
ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆయన నాయకత్వంలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని అధికార యంత్రాంగమంతా కూసుకుంట్ల డైరెక్షన్ లోనే పని చేస్తుందనే చర్చ ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తనకే టికెట్ కన్ఫామ్ అని, తనకు పోటీ కూడా ఎవరూ లేరనే ధీమాలో ఉన్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఆశిస్తులు తనకే ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవలే చండూరు మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరారు. ఆ సమయంలో తనను కేటీఆర్ అభినందించారని, బాగా పని చేస్తున్నారని భుజం తట్టారని కూసుకుంట్ల చెప్పుకుంటున్నారు.
Tamota : మూడు లీటర్ల పెట్రోల్ కు కిలో టమోట.. తగ్గేదేలే..
ఇప్పటికీ కూసుకుంట్ల నాయకత్వంలోనే నియోజకవర్గ గులాబీ లీడర్లున్నా… ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్ మునుగోడు టికెట్ కోసం ఈసారి తీవ్రంగా ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. గత జూన్ లో కర్నె ఎమ్మెల్సీ పదవికాలం ముగిసింది. ఆయనకు మళ్లీ రెన్యూవల్ వస్తుందని భావించినా రాలేదు. ఉద్యమకారుడు కావడంతో కర్మెకు ఏదో ఒక పదవి ఇవ్వాల్సిన పరిస్తితి పార్టీలో ఉంది. దీంతో ఈసారి ఎమ్మెల్సీ కాకుండా మునుగోడు టికెట్ కావాలని హైకమాండ్ ను కర్నె అడుగుతున్నట్లు సమాచారం. 2004లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కర్నె ప్రభాకర్. అందుకే మరోసారి మునుగోడు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను ఆయన కోరుతున్నట్లు చెబుతున్నారు. మునుగోడు నుంచి పోటీ చేసే ఆలోచనతోనే ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కర్నె ప్రభాకర్ ఎక్కువగా తిరుగుతున్నారని చెబుతున్నారు.
CM Kcr : ఢిల్లీలో కేసీఆర్ హ్యాండ్సప్.. ఉత్త చేతులతో రిటర్న్
చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి .. కొన్ని రోజులుగా కూసుకుంట్లకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ పదవుల ఎంపికలోనూ గొడవలు పడ్డారని తెలుస్తోంది. దీంతో కూసుకుంట్లకు వ్యతిరేకంగా దూకుడుగా వెళుతున్న తాడూరి… శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. 2009లో పీఆర్పీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు తాడూరి వెంకట్ రెడ్డి. టీడీపీలో గుత్తాతో కలిసి పనిచేశారు తాడూరి. అందుకే గుత్తా ఆశిస్సులు ఆయనకు ఉన్నాయంటున్నారు. అంతేకాదు నల్గొండ ఎంపీగా పోటీ చేసిన వేమిరెడ్డి నర్సింహరెడ్డికి తాడూరి సమీప బంధువు. మునుగోడు టికెట్ రేసులో వేమిరెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తనకు గాని లేదంటే తాడూరికి ఎమ్మెల్యే టికెట్ కోసం వేమిరెడ్డి లాబీయింగ్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
నాంపల్లి నియోజకవర్గానికి చెందిన కర్నాటి విద్యాసాగర్ కూడా మునుగోడు టికెట్ రేసులో ఉన్నారని తెలుస్తోంది. గతంలో టీడీపీలో పనిచేసిన విద్యాసాగర్.. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కోటరీలో ఆయన కూడా ఒకరని చెబుతారు. పద్మశాలి వర్గానికి చెందిన విద్యాసాగర్… కేటీఆర్ ద్వారా బీసీ కోటాలో మునుగోడు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ రేసులోనూ కర్నాటి పేరు వినిపించింది. వచ్చే ఎన్నికల్లో తనతే టికెట్ వస్తుందన్న అంచనాతో విద్యాసాగర్.. చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతున్నారని అంటున్నారు. ఇక చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం కూడా పోటీకి సిద్దమనే సంకేతం ఇస్తున్నారు. అప్కో డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న కర్నాటి.. పార్టీలోని బీసీ నేతల ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
మునుగోడు జడ్పీటీసీ భర్త నారబోయిన రవి ముదిరాజ్ మునుగోడు టికెట్ రేసులో ముందున్నారని తెలుస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి ద్వారా ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు టికెట్ కోసమే ఆయన ఇటీవల కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారని అంటున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా నల్గొండలో ఉపయోగిస్తున్న ఇల్లు.. రవి ముదిరాజుదే. ఆ విధంగా జగదీశ్ రెడ్డితో రవికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. నియోజకవర్గంలో ముదిరాజ్ లు ఎక్కువగానే ఉన్నారు. అది కూడా తనకు కలిసి వస్తుందని రవి ధీమాగా ఉన్నారంటున్నారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కూడా ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తనకున్న జర్నలిస్ట్ పరిచయాలతో మంత్రి కేటీఆర్ ద్వారా టికెట్ కోసం రాజు స్కెచ్ వేస్తున్నారని తెలుస్తోంది.
GHMC : అక్రమ నిర్మాణాలకు నిలయంగా మల్కాజ్ గిరి సర్కిల్
మొత్తంగా దాదాపు ఏడుగురు నేతలు తీవ్రంగా పోటీ పడుతుండటంతో మునుగోడు టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు రోజురోజుకు ముదురుతోంది. ఇక ఇంతకాలం తన వెంట ఉన్న నేతలే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఆగ్రహం తెప్పిస్తుందని అంటున్నారు. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో బీసీ నినాదం రోజురోజుకు బలపడుతోంది. అదే సమయంలో నియోజకవర్దంలో బలంగా ఉన్న గౌడ్, యాదవ సామాజిక వర్గాల నుంచి కొందరు నేతలు పోటీ చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ కూడా ఆ వర్గాల నుంచి ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తుందని అంటున్నారు. మొత్తంగా ఎన్నికల నాటికి మునుగోడు రాజకీయాలు మరింత కాక రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి …
- పూలే విగ్రహ పున ప్రతిష్ట చర్యలు.. పనులను పరిశీలించిన ఆకుల
- రోజుకు రూ. 5 కోట్ల నష్టం.. హైదరాబాద్ మెట్రో మూతపడనుందా?
- 13 మంది సర్పంచుల రిజైన్.. సొంత జిల్లాలో సీఎంకు బిగ్ షాక్
- ఢిల్లీలో దిక్కు లేని కేసీఆర్.. మూడురోజులైనా నో అపాయింట్ మెంట్స్
3 Comments