
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : అధికార టీఆరఎస్ పార్టీ పెద్దల తీరుతెన్నులు నామినేషన్ల ఘట్టంలో చాల స్పీష్టంగా కనిపించాయి. ఏకగ్రీవం దిశగా అడుగులు వేసేందుకేనా అన్నట్లు ఈ తతంగం కనిపించింది. ఎమ్యెల్సీ పట్నం మహీందర్ రెడ్డి, పిఎ అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి వి నామినేషన్ పత్రాలు గుంజుకొని చించారని పలువురు చెబుతుండగా, నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత నామినేషన్ ఏకగ్రీవం కోసమే అన్నట్లు సంతకం తేడాలను తెరమీదకు తెచ్చారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ల ఘట్టం పూర్తి కాగానే ఫిర్యాదుల పర్వం ప్రారంభం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన కోటగిరి శ్రీనివాస్.. తమ సంతకాలు పోర్జరీ చేసారు.
Read More : కరీంనగర్ బరిలో 24 మంది అభ్యర్థులు – Crime Mirror
అని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 31 డివిజన్ కార్పొరేటర్ రజియా సుల్తానా, నందిపేట్ 3 ఎంపీటీసీ ఎర్రం నవనీతలు ఆరోపించారు. నామినేషన్ ల పరిశీలన ప్రారంభం కాగానే కార్పొరేటర్, ఎంపీటీసీలు బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేసారు. ఇప్పుడు ఈ అంశం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాస్ బరిలో ఉండటంతో ఎన్నిక అనివార్యం అయింది. ఈ క్రమంలో సంతకాలు పోర్జరీ అంశం రాజకీయంగా సంచలనమైంది.
ఇవి కూడా చదవండి …
- రోజుకు రూ. 5 కోట్ల నష్టం.. హైదరాబాద్ మెట్రో మూతపడనుందా?
- మూడు లీటర్ల పెట్రోల్ కు కిలో టమోట.. తగ్గేదేలే..
- ఢిల్లీలో కేసీఆర్ హ్యాండ్సప్.. ఉత్త చేతులతో రిటర్న్
- ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది కేసీఆర్ దీక్ష : సీతక్క
3 Comments