
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం అనూహ్య ఘటనలు జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా సభలో వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. చంద్రబాబు ఆయువు పట్టులాంటి ఆయన కుటుంబం పరువు మర్యాదలపై దెబ్బకొట్టారు. చంద్రబాబు ఫ్యామిలీ ఇమేజ్‌ను టార్గెట్ చేశారు. చంద్రబాబుకు.. భార్య భువనేశ్వరే సర్వస్వం. ప్రాణంకంటే ప్రియం. అందుకే ఆమెపై దాడికి దిగారు. నిండు సభలో భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యేలు.
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల నీచ, నికృష్ట వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు చంద్రబాబు. సభలోనే ఉద్వేగానికి లోనయ్యారు. సభకు దండం పెట్టిన బయటికి వచ్చిన చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. సభలో జరిగిన పరిమాణాలను వివరిస్తూ భోరున ఏడ్చేశారు. చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టడంతో దేశమంతా అవ్వాక్కైంది. అయితే అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఉక్కుమనిషి లాంటి చంద్రబాబు విలవిల ఏడిస్తే.. ఆయన సతీమణి భువనేశ్వరి పరిస్థితి ఎలా ఉందో అన్న ఆందోళన అందరిలో వ్యక్తమైంది. తనపై సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లను ఆమె తట్టుకుంటుందా అన్న భయం కూడా నారా ఫ్యామిలీతో పాటు టీడీపీ నేతల్లో కనిపించింది.
అయితే అసెంబ్లీ జరిగిన ఘటనలు. ప్రెస్ మీట్ లో చంద్రబాబు బోరున విలపించడం చూసిన.. భువనేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. అయితే సాయంత్రానికి తేరుకుని భర్త చంద్రబాబుకే ఆమె ధైర్యం చెప్పారని తెలుస్తోంది.
చంద్రబాబు విలపించడాన్ని టీవీలో చూసిన భువనేశ్వరి.. తాను కూడా విపరీతంగా విలపించారట. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు, లోకేశ్ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. వారిని చూడగానే ఆమె మరోసారి రోదించారు. కానీ ఆ తర్వాత ఆమె త్వరగానే కోలుకున్నారు. జరిగిన ఘటనలపై బాధపడుతున్న చంద్రబాబును ఆమె ఓదార్చారని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
చంద్రబాబు ఇంటికి వెళ్లగానే.. ‘దిగజారిన మనుషులు ఏవో మాట్లాడతారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి’ అని భువనేశ్వరి ఆయనను అనునయించినట్లు సమాచారం. ‘రాజకీయాల్లో ఒక్కోసారి ఇటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆయనను ఉద్దేశించి ఇలాగే నీచంగా మాట్లాడేవారు. మనసుకు బాధ కలిగినా వాటిని వెనక్కినెట్టి మన పని మనం చేసుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టడానికే ఇలా మాట్లాడుతుంటారు. వారిని పట్టించుకోవద్దు’ అని ఆమె అన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో జరిగిన ఘటనలతో శుక్రవారం బాగా బాధపడిన చంద్రబాబు.. భార్య భువేనశ్వరి ఇచ్చిన ధైర్యంతో త్వరగానే మామూలు స్థితికి వచ్చేశారని చెబుతున్నారు. శనివార ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వరద పరిస్థితిపై చర్చించారు.
4 Comments