
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : నందమూరి కుటుంబంలో బాలకృష్ణ తర్వాత అంతటి క్రేజ్ ఉన్నోడు జూనియర్ ఎన్టీఆరే. బుడ్డోడు.. స్వతహాగా ఆవేశపరుడు. ఫుల్ ఎమోషనల్. మాటంటే పడరు. మాటకు మాట గట్టిగా జవాబిచ్చే సత్తా ఆయన సొంతం. అలాంటి ఎన్టీఆర్.. తన నందమూరి కుటుంబ సభ్యురాలిని, స్వయానా మేనత్తను.. వైసీపీ మూకలు అంతేసి మాటలు అంటే.. చాలా సాదాసీదాగా స్పందించాడు. అది కూడా చాలా ఆలస్యంగా బయటికి వచ్చి.
మోడీతో తేల్చుకుంటానంటున్న కేసీఆర్..
నందమూరి ఫ్యామిలీ అంతా మూకుమ్మడిగా ముందుకొచ్చి మీడియా సమావేశం పెట్టిన తర్వాత.. విమర్శలు వస్తాయని అనుకున్నాడో ఏమో ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రీలిజ్ చేశాడు. ఏవో కొన్ని పదాలు చెప్పేశాడు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పాడు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు, అదీ ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఒక అరాచక పాలనకు నాంది అన్నారు జూనియర్ ఎన్టీఆర్.
జగన్ పార్టీపై నందమూరి ఫ్యామిలీ అటాక్.. తాట తీస్తామని వార్నింగ్..
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. జరిగిన పరిణామాలను ఖండించాడు తప్ప, సంఘటనకు కారణం అయిన వాళ్ళను విమర్శించలేదు ఎన్టీఆర్. జూనియర్ నోట ఎక్కడా నందమూరి మాట రాలేదు. వైసీపీ అన్న పదం కూడా లేదు. చంద్రబాబు కుటుంబంపై నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యేల గురించి చెప్పలేదు. పైగా ఒక కుటుంబం అని మాట్లాడారు ఎన్టీఆర్. దీంతో ఆ కుటుంబం ఈయనది కాదా అన్న ప్రశ్న వస్తోంది. జూనియర్ వీడియో చూసిన వాళ్లంతా.. అసెంబ్లీలో జరిగిన సంఘటను జనరలైజ్ చేశాడు తప్ప.. తన కుటుంబ సభ్యురాలు మీద జరిగింది అరాచకంగా జూనియర్ ఫీల్ అవలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా RRR సినిమా వారి వత్తిడి మీదే ఇచ్చారనే చర్చ సాగుతోంది. జూనియర్ స్పందనపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
83లో లోకేష్ జననం.. 85లో మాధవరెడ్డి టీడీపీ సభ్యత్వం!
భువనేశ్వరిపై పిచ్చి వాగుడు వాగుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు తన మిత్రులు కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ అలా స్సందించారా అన్న ఆరోపణలు వస్తున్నాయి. మేనత్తను అంతేసి మాటలు అంటే.. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే.. సీరియస్ గా స్పందించకుండా ఇలా సింపుల్ గా మాట్లాడటం ఏంటని కొందరు జూనియర్ అభిమానులు కూడా నిలదీస్తున్నారు. మిగితా కుటుంబ సభ్యులు ఆవేశంగా ఊగిపోతుంటే.. జూనియర్ మాత్రం సింపుల్ రియాక్షన్ ఇవ్వడాన్ని తమ్ముళ్లు తప్పు పడుతున్నారు. ఇంత దారుణం జరిగినా సీరియస్ గా తీసుకోని వ్యక్తి నందమూరి కుటుంబ సభ్యుడు ఎలా అవుతాడని కూడా కొందరు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌పై ఓ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన తీరుపై జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని అన్నారు. అసలు స్పందించకుండా ఉంటే బాగుండేదని సూచించారు. ఎన్టీఆర్ అనే పదంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన తమరు స్పందించిన తీరు బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కర్ర విరగదు.. పాము చావదు’ అనే సామెతగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఉందని అభిమాని క్లాస్ తీసుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇలాగేనా స్పందించేది అని దుమ్మెత్తిపోస్తున్నారు. మీ మేనత్త భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిస్తే స్పందించే తీరు ఇదేనా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.భువనేశ్వరిని అనకూడని మాటలు అని మానసిక క్షోభకు గురిచేస్తే.. ఆమె భర్త, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు చీమైనా కుట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు. నందమూరి వంశంలో జూనియర్ పుట్టలేదా? అని నిలదీస్తున్నారు. నందమూరి తారక రామారావు పేరు వాడుకుంటూ, ఆయన వారసత్వాన్ని అనుభిస్తూ.. ఆయన కుమార్తెను కించపరిస్తే నీకు ఎందుకు పౌరుషం రాలేదని ప్రశ్నిస్తున్నారు. మీ మేనత్తను అవమానించిన వారిపై స్పందించే తీరిదేనా అని తూర్పారపడుతున్నారు.
చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరం: పవన్ కల్యాణ్
అసలు గుడివాడలో, గన్నవరంలో నీ మిత్రులకు టీడీపీ టిక్కెట్లు ఇప్పించుకోడానికి చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ ఎంతలా పీడించిందీ ఆ పార్టీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నారు. నిజానికి టీడీపీని వాడేసుకుంటున్నదే జూనియర్ ఎన్టీర్ అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆరే కొందరి చేత మేనత్తను, మేనమామను వెనక ఉండి మరీ తిట్టిస్తున్నారనే అనుమానాలు టీడీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తన మేనత్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇంత సమయం గడిచే వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుండా జాప్యం చేయడం పైనా టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన సంఘటనపై అన్ని వర్గాల వారు, ఆడపడుచులు తీవ్రంగా స్పందిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నందమూరి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ స్పందించినా మీరెందుకు బయటికి రాలేదంటున్నారు.
నందమూరి ఫ్యామిలోని ఏనాడూ మీడియాలోకి రాని వ్యక్తులు కూడా తమ ఇంటి ఆడబిడ్డకు జరిగిన అవమానంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే.. మీరు తక్షణమే స్పందించకపోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారు. చివరికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా వైసీపీ నేతలు చేసింది తప్పు అని డైరెక్ట్‌గా ఖండించారు కదా.. మీకేమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కర్ర విరగకుండా.. పాము చావకుండా అన్న చందంలో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఎందుకు వీడియో విడుదల చేయాల్సి వచ్చిందని టీడీపీ శ్రేణులు, నేతలు నిలదీస్తున్నారు.
రాజకీయాలకు తాను దూరం అని ఎన్టీఆర్ సమర్థించుకోడానికి కూడా లేదు. ఇది రాజకీయం కాదే? కుటుంబ వ్యవహారం.. కుటుంబ పరువు, ప్రతిష్ట, మర్యాదలకు సంబంధించిన మేటర్. కుటుంబం లేనిది ఆయన ఎక్కడ? నందమూరి ఇంటిపేరు లేకపోతే.. ఎన్టీఆర్‌కు గుర్తింపేముంది.. విలువేముంది? ఏ కుటుంబం వల్లనైతే అతనికి ఇంతటి హోదా, గౌరవం లభిస్తుండే.. ఇప్పుడు ఆ కుటుంబమంతా కలిసి.. భువనేశ్వరికి మద్దతుగా నిలబడితే.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు వాళ్లతో కలిసి రాకపోవడం తప్పుకాదా? పాలిటిక్స్ వద్దంటూనే పాలిటిక్స్ చేస్తున్నారా? అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. జూనియర్ అభిమానులు కూడా ఇలానే నిలదీస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి…
- కృష్ణుడి చేయి విరిగిందని హాస్పిటల్ వెళ్లిన పూజారి..
- కేసీఆర్ ఖజానాకు అప్పనంగా 14 వందల కోట్లు! మద్యమా మజాకా..
- కవితకు ఎమ్మెల్సీ లేనట్టేనా? కేటీఆర్ తో గొడవలే కారణమా?