
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : పెట్రోల్ రేటు మరోమారు తగ్గింది. అంతేకాకుండా డీజిల్ ధర కూడా దిగొచ్చింది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్, డీజీల్ రేట్లు తగ్గించిన రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ చేరింది. దీంతో పెట్రోల్ రేటు లీటరుకు రూ.4 మేర, డీజిల్ ధర లీటరుకు రూ.5 మేర తగ్గింది.
ఇకపోతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా నిలకడగానే కొనసాగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది.